Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/775

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

752 గోపీనాథ రామాయణము నిరాలంబం బగువాయు మార్గంబునం బ్రవర్తిల్లుటంజేసి పదనిక్షేపణశబ్దరహి| తం బై చెల్లె నప్పుడు. శా. ఘోరాకారుఁడు మాల్యవంతుఁడు చలతో వండటం కార మే పార నే చకవృష్టి మేఘము మనంబై గాఢవర్షం బొగి న్నీ రంధ్రంబుగఁ గాంచనాచలముపై నిండార వర్షించిన ట్లారూఢం గపివీరు పైఁ గురిసె ముద్యత్సాయ కాసారమున్. ఉ. దానికి నించుకైన మదిఁ దత్తఱ మందక ధీరుఁ డామరు త్పూనుఁడు వాలఘాతమున సూరెల నన్నిటిఁ దూలఁ దోలుచుకొ మానితతిX తేజమున మంచును మాయఁగఁ జేసి నింగిపై మానుగ నొప్పుభాస్కరునిమాడ్కి వెలింగె నుదీర్ణ తేజుఁ డై. - 2191 2492 2499 ఆ. అంత మాల్యవంతుఁ డరుష్టుఁడై గద, ద్రిప్ని వహ్నికణము లుప్పతిల్ల వాయుసుతునిమీఁద వైచి పెల్లార్చి తా, దిట్టతనము మెఱయ నిట్టు లనియె. -అడి హనుమంతుండు మాల్యవంతునిం జంపుట. పూర్వం మ. అవురా వానర తొల్లి విష్ణుఁడు ఖగేంద్రారూఢుఁ డై వచ్చిన న్ను వడిం దాఁకి రణం బొనర్చి తదిఁ దానుం బోరఁగా లేక శ కివిహీనుం డయి పాతె నాజి సలుపం గీతుండ వీ వెంతవాఁ డవు సప్రాణుఁడ వై వెస స్థలధిఁ గొండ స్వైచి పొ మ్మవ్వలన్. చ అన విని వాయుపుత్రుఁడు మహాగ్రహుఁ డై వెసఁ దత్ప్రయుక్తకాం చనగద నుద్ధతిం జదిపి చయ్యనఁ జూర్ణము చేసి బల్విడి ఘననఖరంబులం జిదిమి కండలు చెక్కలువాపి యల్కతోఁ బనివడి వానిగుండియలు బ్రద్దలు వాఱఁగఁ దన్నె సంఘులన్. 2495 2496 వ. అంత నద్దానవుండు కాలవ్యాళకరాళం బైనకరవాలంబున వేసిన నదివజ్రసను స్పర్శం బైనతదీయవంబు దాఁకి సహస్ర ఖండంబులై పుడమిం బడియెఁ బదం పడి కాలాయసమయం బైనముసలంబు విసరివై చిన దానిఁ గరంబుల నొడిసి పట్టి మదోద్దండ వేదంశం బిశుదండంబుంబో లె విఱిచి వై చె వెండియు దంష్ట్రా కరాళభీషణం బైనశక్తి నిగిడించిన దాని సముద్ర జలంబులం బడునట్టుగాఁ బాదంబులం దన్నె నంత నద్దానవుండు వికల సాధనుండై సేయునదిలేక వెల్లనై సూచుచుండ నప్పుడు బాహువుల వాని నాకర్షించి పాణిని ష్పేషణంబున హీన నత్త్వుం గావించి వాలపాశంబు గళంబునం జుట్టి మీఁది కెత్తి ఖగేంద్రుండు కాళోదరంబుం బోలె వేయిమాఱు లంబరంబునం ద్రిప్పి సముద్రంబులఁ బడ వై చిన నన్ని శాచరుండు పతన వేగంబున రసాతలంబంటి మరల వచ్చుటకు సామ ర్థ్యంబు లేమిం జేసి మృతుండై యమసదనంబునకుం జనియె హతశేషు లగు రక్కసు లుక్కు సెడి భయభ్రాంతులై లంకకుం బఱచి రిట్లు వాతూలనందనుండు