| మ. |
అనఘా మీ రిపు డానతిచ్చినటులే యౌ సర్వధర్మప్రభా
వనిరూఢస్థితిఁ జెల్లె నీకు మరల న్వాగ్రుచ్చి మాఱాడువాఁ
డనె మౌఢ్యంబున నింతకుం జెడగుమాట ల్పల్కితి న్దప్పుగాఁ
గొన కన్నింటి సహించి కానఁ గదవే ఘోరాఘసంతానునిన్.
| 495
|
| తే. |
అనఘచారిత్ర నీవు దృష్టార్ధతత్త్వ, విదుఁడవు జగద్ధితుండవు విమలబోధ
చిత్తుఁడవు కార్యకారణసిద్ధియందు, నీదుబుద్ధి ప్రసన్నయై నెగడుచుండు.
| 496
|
| వ. |
మహాత్మా యేను గృత్యాకరణవంతుండఁ బురస్కృతవ్యతిక్రాంతుండ నన్నుఁ
బ్రియవాక్యంబుచేత నాశ్వాసింపుము.
| 497
|
| సీ. |
మనుజేంద్ర నాకు సామ్రాజ్యంబు మేనిపైఁ దారపై మిత్రబంధువితతి
పై నొకించుకయును భ్రాంతి లేదు గుణాకరుండు సువర్ణాంగదుండు నంగ
దుండు పిన్నటనాఁటనుండి పెంచినవాఁడు గావున నాపాటుఁ గాంచి వీత
కమలతటాకంబుకైవడి శోషించునో యని చింతించుచున్నవాఁడ
|
|
| తే. |
వాఁడు బాలుండు నేరనివాఁడు ప్రియుఁడు, నేకపుత్రుండు బలవంతుఁ డినసుతుండు
బోలె నీచేత సతతంబు బ్రోవఁ దగిన, వాఁడు నీపంపుఁ గావించువాఁడు సుమ్మి.
| 498
|
వాలి యంగదుని రక్షింపవలయునని రాముని వేఁడుట
| చ. |
అనఘచరిత్ర, నీవును నియంతవు శాస్తవు రక్షకుండ వా
జనపతి చన్న పిమ్మటఁ బ్రసన్నకృపాప్తి సుమిత్రపట్టియం
దనిశము గైకయీతనయునందును భానుజునందుఁ గల్గుపా
యనియనురక్తి యంగదునియందును జేర్పుము నాదుపిమ్మటన్.
| 499
|
| తే. |
బహుతపస్విని సర్వజ్ఞ పరమసాధ్వి, యయ్యు మద్దోషకృతదోష యయ్యె నట్టి
తార నిఁకఁ దప్పు లెన్నక తపనసుతుడు, ప్రోచునట్లుగ నియమింపఁబోలు నీకు.
| 500
|
| చ. |
వదలక నీకు భృత్యుఁ డగువాఁడు సుఖాస్పద యైనధారుణిన్
సదమలనాకమున్ బడయఁజాలు నెఱింగియ కాదె తార వ
ల్వదనుచుఁ జెప్పినన్ వినక వచ్చితి భానుకుమారుతోడ నె
ల్లిదముగ ద్వంద్వయుద్ధ మఱలేక యొనర్పఁగ స్వర్గకాంక్షినై.
| 501
|
| క. |
అని పలికి సన్నతుండై, వనచరపతి యూరకున్న వసుధేశుం డా
తనిఁ గాంచి ధర్మతత్త్వా, ర్థనియుక్తమృదూక్తిఁ బలికెఁ దద్దయు నెమ్మిన్.
| 502
|
| వ. |
వానరేంద్రా నీ విక్కార్యంబునకు వగవం బని లేదు భవదకృత్యవిశేషంబునఁ
బ్రాయశ్చితరూపధర్మంబునందు మేము కృతనిశ్చయుల మైతిమి కావున నకృ
త్యంబుఁ గావించి రని మమ్ము విచారింపవలదు నీకుఁ బరలోకప్రతిబంధకంబు
గల దని నిన్నును విచారంపవలదు పూర్వోక్తమనువచనప్రకారంబున మన
కిరువురకును దోషంబు లేదు దండార్హునియందు దండంబు ప్రయోగించిన
వాఁడును దండితుం డైనదండార్హుండు నయ్యుభయులును గార్యం బైనగరిద
|
|