యు కాండము. అంధం, ధాన్యమాలినికి మకరరూపంబు వదలి యప్సరోరూపంబు వచ్చుట. దృర్శం- నీ, తనయచిరత్వంబు దలఁగఁ బెట్టి తనుత్వ మరుదారఁ గైకొన్న మెఱుఁగుభంగి సతతంబు గగనసంచారంబుపై రోసి ధరణికి వచ్చిన తారపగిది నందనోద్యానంబుసం దున్ని మాని యుర్వర జనించెడుకల్పవల్లి మాడ్కి ముజ్జగంబుల నెల్ల మోహింపఁ జేయంగ స్మరుఁడు పంపిన పుష్పశరముకరణిఁ తే. దనువు గైకొని వెలికి వచ్చిన సరోంబు బింబితమనోజ్ఞ శళీకరణంబురీతి మాక రాంగంబు విడిచి యమ్మకరి యపుడు సుందరాకారయువతి యె చూడ నొప్పి. సీ. బంభరీభూషితపం కేరుహంబులు నలువొప్ప నయనాననములు సేసి జలభంగ సంచలచ్చారు చక్రంబులు రమణీయకుచనితంబములు సేసి భూరిసౌరభలుబ్ధపుష్పంధయశ్రేణీ తీ రైనజడయు నూఁగాకు సేసి పొందుగా విరిసిన కెందమ్మి జేకులు చరణయుగ్మాధరోష్ఠములు సేసి తే. మొలక నవ్వులు నునుదొడ ల్వలుఁడ చెక్కు. లలరునాభియుఁ గలదు లేదనెడుకౌను వఱల సాక్షాత్క రించిన సరసిలక్ష్మి వైఖరిఁ జెలంగు చున్న యవ్వనితఁ జూచి. ఉ. మారుతి యేమిచిత్ర మిది మాకరరూపము మాని భూరితే జోరమణీయమూర్తి యగుసుందరి యై కన నయ్యెడి స్మరు త్సారసనేత్ర యో భుజగ చంపక గంధియె యక్షశాంతయో చారుజలాధి దేవతయొ జవ్వని యంచుఁ దలంచు చుండఁగన్, చ. అతులసువర్ణ రత్నరచితార్క సమానవిమాసరాజు ను ద్భుతగతి నెక్కి కారెఱుఁగు పోలిక నింగి వెలుంగఁ జేయుచుకో స్మితరుచిజాల మవ్విపినసీమకు వెన్నెల తేటఁ జూపఁగాఁ జతురతఁ బల్కెఁ బావనికి సాంద్ర సుధారసధార లొల్కఁగన్. ఉ. మారుతి నీ ప్రసాదమున మాకరరూపము వీడి నేఁటి కి చ్చో రమణీయభంగిఁ గడుసొంపుగఁ దాల్చితి దివ్య దేహ మిం పారఁగఁ బూర్వజన్మ సుకృతాతిశయంబు ఫలించి దుఃఖముల్ దీజెఁ గృతార్థ నైతి నిఁక దేవజగంబున కర్థి నేగెదన్. సీ. అనిలనందన యిది ముని తపోవని గాడు దితిజమాయావినిర్మితవనంబు దశకంఠుపనువునఁ దాట కేయసుతుండు తనమాయచే దీనిఁ దగ సృజించి తాపన వేషంబుఁ దాల్చి నీకంతరాయము నేయ నిచ్చటి కనిపె నిన్ను వీనిమాటలు నీవు విశ్వసింపఁగ రాదు తెగున్నడాన్ని వీని వధించి వుచ్చి 2424 2425 2426 2427 2429
పుట:గోపీనాథరామాయణము2.pdf/764
స్వరూపం