Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/752

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాండము. 729 నోపక భయవిహ్వలితగాత్రుం డై రణభూమి విడిచి కచభారంబులు వీడఁ గమ నీయరత్నఖచితభూషణ వ్రాతంబు కనుకనిం జెదరం జరణాభిహతి మహీచక్రంబు కంపిల్లఁ దొలంగి లంకకుం బాణి యంతఃపురంబుపొచ్చి నొచ్చినయంగంబులు సవరించుకొని కొండొకసేపు సేద దీర్చికొని లజ్జాభయవిషాదంబులు మొగం బునం దోఁప నేమియుం దోఁపక నిజపత్నీ యగుమందోదరి రావించి య దేవి తోడఁ బెద్దయుం బ్రొద్దు చింతించి యిట్లనియె.

  • శ్రీరాములచే దెబ్బలు దీని రావణుండు మందోదరితో విలపించుట. భర్మం

2847 సీ. ఏమని చెప్పుడు నింతిరో నేఁ డుగ్రరణమునఁ గల్గు పరాభవంబు రాముండు లయకాల భీమునికై వడి సత్యు గ్రమూర్తియై యచలసార మగువింట మంటారవార్భటుల్ సెలఁగంగ జ్యావల్లి సవరించి సాంద్రభంగి విలయశాలాభ్రంబు వృష్టిని గురియించు కరణి నాయకవృష్టి, గురియఁ జేసె తే. సమ్మహాసాయకనికాయ మబ్ధివేగ మనుకరించి యవార్య మై యరుగుదెంచి దీవిచందాన నను ముంచె జీవితంబు దక్కఁ గొని వచ్చినాఁడ యత్నంబుతోడ. చ. అసలునికన్న వేఁడిమి బలాంతకవజ్రము కన్న వాఁడిమీ ఘనతర కాలదండమునకన్న నమోఘత మారుతంబుక న్నను గడు వేగముగా గలిగి దాశరథి ప్రవిముక్తఘోరమా ర్గణములు కాలసర్పములకై వడిఁ ద్యాణి కలంచె మర్మముల్, చ. హరిహయుతోడఁ బోరితి ధనాధిపుతో సమరం బొనర్చితి వరుణయమాగ్నికోణపతి వాయుధినేతులతోడ ఘోరసం గర మొనరించితి ఫణిజగత్పతితోడ రణంబు సల్పితికా సరసిజనేత్ర తద్విశిఖ సంతతి కింత రయంబు లే దొగిన్. 2348 2849 2850 ఆ. హరుని కంటికుంట లవి సహింపఁగ వచ్చుఁ, గాని రామశరనికాయ మించు కయు సహింపరాదు కంటివె జల్లెడ, కంత లయ్యె నాదుగాత్ర మెల్ల. 2851 సీ. జగము లన్నియు మ్రింగఁ జాలు పరాక్రమో దీర్ణుండు మనకుంభకర్ణుఁ డిలై నింద్రా దిదిక్పాలహృచ్ఛూల మైన వీరోత్తముం డలశ క్ర జిత్తు మడి సె నీతిసారజ్ఞ విఖ్యాతి వాటించిన మన తేజుఁ డయ్యతికాయుఁ డడఁగె ననిలోన మాణిభ ద్రాదులఁ దోలిన చండ వీర్యుఁడు ప్రహస్తుండు గౌడ సె తే. నఖలరణములయందు మున్నారితీరి, నట్టి జెట్టిజోదులు మకరాక్షవజ్ర దంష్ట్ర దేవాంత కాది ప్రధానదైత్య, వదులు గూలిరి రణమందు హరుల చేత, ఆ, అఖిలభువనవిజయ మర్మిలిఁ గావించి, యసురవిభుఁ డనంగ ఖ్యాతి వడసి యమరవర్యు లూడిగములు నేయఁగ ధాత్రి, వన్నె గన్న యేసు భంగపడితి, 172