Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/715

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

693 గోపినాథ రామాయణము త్తము వేనోళ్ల నుతించుచుఁ గొమరారఁగఁ బుష్పవృష్టి గురిసిరి వేడ్కన్.2065 క. సురతటినీజలశీకర, పరిషి తదీయకమల పరిమళ లహరీ పరికలితుఁడై రఘూత్తము, పరిశ్రమము వాయ నపుడు పవనుఁడు విసరెన్. క. పాడిరి గంధర్వులు గోని, యాడిరి పరమర్షి చారణాదులు దివి పై P నాడిరి దివ్యాప్సరసలు, తోడనె మ్రోయించి రమరదుందుభులు రహీన్, 2067 క. విగతవ్యథంబు లై సమ్యగలంకృత మందిరంబు లై భవ్యము లై నిగదితశుభకథనము లై, జగములు శోభిల్లె నపుడు సమ్మోందమునన్. మ.దురితాత్ముం డగురావణాత్మజునిచే దూరీకృత స్వార్జితా 2068 2069 2070 2071 ధ్వరు లై గొందుల డాఁగి దిక్కఱి మహాదైన్యంబుతో నున్నయా పరమర్షి ప్రభు లింక నాత్మ తపము ల్పాలించుచు, హృష్టులై చరియింపం గల రంచుఁ బల్కిరి దివి న్సాద్యోరగు ల్దేవతల్. మ. తను మున్నాజి జయించినట్టి ఖలుఁ డుద్యద్భాహువీర్యుండు ష్టనిశాటుండు దశాస్యపుత్రుఁ శనిలో వ్మానాథపు త్ర ప్రయు కనిశాతాస్త్ర విలూనకంఠుఁ డగుచుం ధాత్రీస్థలిం గూలినం గని యానందము నొందె శక్రుఁడు మరుద్గంధర్వయు క్తంబుగన్. ఉ. మించిన వేడ్కతో సురలు మింటను దుందుభు లొక్కరీతి వా యించిరి పుష్పవృష్టి గురియించిరి పెక్కు తెఱంగుల ద్వినో దించిరి రాజుపుత్రు, వినుతించిరి నిర్జరవారకాంత ల భ్యంచితభంగి నాడిరి జయాంకముఁ బాడి వీడి రాపదల్. సీ. నీరధు లన్నియు నిర్మలాంబువు లయ్యె దిక్కు లన్నియుఁ జూలఁ దెల్వి నొందె గగనంబు గ్రహతారకాయుక్త మై యొప్పై సుస్థిర యై ధాత్రిఁజూడ నయ్యె మేదురస్వనము లై మేఘంబు లొప్పారె విగతార్తిబహుళ మై జగము దనఁ బుష్పవంతంబులై బుణ్యాశ్రమము లొప్పె ఘనతరంగిణులు ప్రకాశ మొందె తే. సురభిశీతలపవనుండు సుడిసెఁ జంద్ర, సూర్యు లెప్పటివలె భూరిశోభఁ దాల్చి రజలలోక భయావహుం డగుదశాన్యు, కొడుకు సౌమిత్రిచే నాజిఁ గూలుచుండ. క. అమరరిపుఁ డీలై నిఁక భూ,మ్యమరు లిఁకఁ బ్రశాంతకలితు లై విజ్వరు లై యమరఁ జరింతురు గాకని, యమరగరుడ సిద్ధసాధ్యు లాడిరి వరుసన్. వ. ఇట్లు దేవగణంబులు పరమోత్సవంబు సలిపి ప్రియదర్శనుం డై నసౌమిత్రి నభి నందించి పరమానందభరితాంతఃకరణు లై దివంబునకుం జని రంత రాక్షసులు లక్షణబాధపడితుం డైన రావణీ నవలోకించి జితకాశు లగువానరుల చేత వధ్య మానులై యాయుధంబులు పరిత్యజించి భయంబునం బఱచి కొందఱు లంకా పురంబు ప్ర వేశించిరి కొందఱు సముద్రంబునం బడిరి కొందఱు పర్వతగుహ లాశ్రయించి 6 త్తెఱంగున సూర్యుండ సంగతుండై ననతనికిరణంబు లతనితో c గూడ నరిగిన చందంబున నింద్రజిత్తుండు పాతుం డగుచుండ రాక్షసు లందఱు 2078