Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/711

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

688 గోపీనాథ రామాయణము ఆ. శత్రుతాపి యైనసౌమిత్రి చే నిట్లు, హన్యమానుఁ డగుచు నసురవరుఁడు కనుల నిప్పు లురలఁ గాకుత్సవంశాగ్ర, గణ్యు ఘోరసాయకములఁ గప్పె. 2028 ఉ. దానికి నల్గి రాఘవుఁడు దారుణ శాతశిలీముఖంబులం దానవము క్త కాండములఁ దట్టి వడిం గరలాఘవంబున 1 2080 నానక సూతుఁ జంపినఁ గ్రమంబున వాజు లవిక్లబంబు లై పూని రథంబు మోచికొని పూర్వగతి న్విహరించె నేర్పునన్. ఆ. ఆవిధంబుఁ జూడ సద్భుతం బయ్యె సౌమిత్రి యంతఁ గనలి మిహిరకిరణ తులితసాయకములఁ దోడ్తోడ వేగంబు, నివ్వటిల్ల హరుల నొవ్యఁ జేసె. 2031 క, `రాఘవునిభూరికి రశర, లాఘవ మది చూచి కనలి రాక్షసవర్యుం ఢాఘోషం బడర దళా, మోఘశరము లేసె వక్షముం దాఁకంగన్. 2032 ఆ. వానివజ్ర తుల్య వాసుకిసన్నిభ, సాయకములు పవనసమరయమున నేగి రఘువ రేణ్యు హేమవర్మము దాఁకి, మిడుఁ గుఱులు సెలంగ మిట్టిపడియె. ఉ. అంతటఁ బోక వాఁడు విలయాగ్నివిధంబునఁ బేర్చి యార్చి కా లాంతకదండకల్పనిశితాంబకము ల్వెస మూఁడు గూర్చి య త్యంతరయంబునం గుణరవార్భటి వింటఁ జెలంగ నమ్మహీ కాంతకుమారుఫాల ఫలకం బొగి నాటఁగ నేసి నుద్ధతిన్. తే.ఘనలలాటస్థనటుసాయక త్రయమున, నమ్మహారాజసుతుఁడు రణా గ్రమందుఁ శోభిల్లే నపుడు లసత్రిశృంగ, కలిత మైనసుమేరునగంబు కరణి. 2084 2035 తే. రాజసుతుఁ డిట్లు రాక్షసరాజతనయ, బాణవిద్ధుఁడై కోపంబు ప్రజ్వరిల్ల ధనువు సారించి వానివక్త్రంబుమీఁద, విశిఖపంచక మడరించి వెగడుపఱచె. న. ఇట్లు మహాబలశరాసనులును సముద్యతాయుధులును మహావీరులును భీమవరా క్రములును బ్రచండ వేగులును నగు రాజనందనరావణనందనులు పరస్పరజయా భిలాషలం గవిని నిశితా గ్రంబు లగుఘోరనారాచంబు లొండొరులబూఁదం బరగించుచు శోణితదిగ్ధాంగులై పుష్పితాశోకకింశుకంబుల చందంబునం దేజరిల్లు చుండి రప్పుడు సమరకోపసంయుక్తుండై రావణాత్మజుండు సౌమిత్రిజోడం బో రుచు నేడగని మూఁడువాఁడితూపులు విభీషణువదనంబు గొఁడ నేసి వెండియు లాఘవంబున నయోముఖంబులై న భల్లంబులు పరఁగించి యొక్కొక్క శరంబున నొక్కొక్క వానరుం దూలనేసి వానరుల నందఱ బడలుపడం జేయుచు విజృం భించిన నతని భుజాటోపంబున కలిగి విభీషణుండు గదగొని సాహసంబున వాని రథంబు పైకి లంఘించి హయంబులం జరియ మోఁదిన నతండు హతాశ్వనూ తుండై పుడమికి దాఁటి కోపాటోపంబున, క. మదమున రథశక్తిం గొని, వదలక పినతండ్రి మీఁద వై చిన దానిం జదలఁ గని రాముతముఁడు, పదితునుకలు సేసె నడుమఁ బటు భల్లములన్. 2087