Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ననికిఁ బిలిచినఁ బోకుండు టనుచితంబు, గాన వచ్చితిఁ బగతునికడిమిఁ జెఱుప.

428


క.

వీరునితో మార్కొని ప్రతి, వీరుఁడ నై పోరుచుండ వెనుక నొదిఁగి ని
ష్కారణముగ వంచించి వి, దారింపఁగ నీకు రాజధర్మం బగునే.

429


ఉ.

లావును జేవయుం గలయిలాపతి రాముఁడు తోడు గల్గు సు
గ్రీవుని కీవు పోవలదు కృత్రిమభంగి వధించు నంచు నా
దేవి యెఱుంగఁ జెప్పినను ధీరతఁ గైకొన కమ్మహాత్ముఁ డే
లా వధియించు ధర్మపరుఁ డంచుఁ దలంచితిఁ గాదె యత్తఱిన్.

430


క.

నిర్మలమతి వనియును నృప, ధర్మవిశారదుఁడ వనియుఁ దలఁచితి నిటు దు
ష్కర్మమునకు బోయలక్రియ, నర్మిలి బాల్పడుటఁ దలఁపనైతి నృపాలా.

431

వాలి రాముని నానావిధంబుల నిందించుట

క.

నీపాటిధర్మపరునకు, క్ష్మాపాలకుమార యిట్టికల్మషకార్యం
బేపాటి తృణసమావృత, కూపమ వని ని న్నెఱింగికొన లేనైతిన్.

432


క.

మనమునఁ గిల్బిష మిడుకొని, మునివేషముఁ బూని నెయ్యిఁ బూసినయసి సొం
పున భస్మచ్ఛన్నుం డగు, ననలునిక్రియ నుండు టెఱుఁగనైతి నృపాలా.

433


క.

విను మెంత సత్కులంబున, జనియించిన నేమి కపటచరితుఁడు మదిలోఁ
దనగుణము విడువ నేర్చునె, జనవర నీయందు నట్టిచందము దోఁచెన్.

434


క.

ము న్నెచ్చట నైనను నీ, కెన్నఁడు విప్రియ మొనర్చి యెఱుఁగనినన్నుం
గ్రన్నన నీదగుదౌష్ట్యం, బెన్నిక కెక్కంగఁ జంపి తేల నృశంసా.

435


క.

సదయుఁడు రాఘవుఁ డేలా, యదయతఁ బాపంబు సేయు నని యేమఱి యి
ప్పు డనికి వచ్చిననన్ను, న్వధియింపఁగఁ జెల్లె నీకు వంచనచేతన్.

436


క.

ఫలమూలంబులు మెసవుచు, నలయక నిత్యంబు దారుణారణ్యములం
గలయ విహరించుచుండెడు, బలీముఖుని సన్నుఁ జంపఁ బాడియె నీకున్.

437


క.

కులమును సత్యము తేజము, చెలువము విక్రమము ధృతియు శీలము యశము
న్బల మెచ్చు కలిగి యుండఁగ, నిల నీమనమునకు హైన్య మేటికిఁ గలిగెన్.

438


తే.

రాజకులమునఁ బుట్టి విశ్రాంతిఁ గాంచి, నట్టివాఁ డెవ్వఁ డవని నీయట్ల కపట
ధర్మలింగప్రతిచ్ఛన్నతావిశేష, మలముకొని క్రూరకర్మంబు నాచరించు.

439


తే.

అవని నిట్టియభవ్యుండ వైననీవు, పావనం బైన మౌనిరూపంబుఁ దాల్చి
యేల విహరించెదవు ధర్మశీలుఁ డనఁగ, లోకవిఖ్యాతి యెబ్భంగి నీకుఁ గలిగె.

440


తే.

మానవేంద్ర పాపాత్ముండ వైననీకు, భవ్యతర మైనమౌనిరూపం బిదేల
సమరధర్మప్రకారవిశారదులకుఁ, దాల్పఁ దగినదివ్యకోదండ మేల.

441


వ.

రఘువరా యేము వనచరులము మీరు మనుష్యుల రేము మూలఫలోపజీవు
లము మీరు రాజాన్నభోజనులరు గావున మీకు మాకు నించుకయైన వైరప్ర
సక్తి గలుగ దదియునుం గాక.

442