Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/682

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నంతయు నొవ్వఁ జేసి రయమార వధించెద రుగ్రమూర్తులై.

1808


ఉ.

మానద భూమి సొచ్చిన నమర్త్యజగంబున కర్థి నేగిన
న్మానక మిన్ను ప్రాఁకినఁ గ్రమంబున వార్నిధిలో మునింగినం
బూని రసాతలంబునకుఁ బోయిన మత్పరమాస్త్రదగ్ధుఁడై
యీనముచిద్విషద్విమతుఁ డిప్పుడె తప్పక ధాత్రిఁ గూలెడిన్.

1809

ఇంద్రజిత్తు మాయాసీతను గల్పించి దానిం జంపఁబూనుట

వ.

అని పలికి యక్కకుత్స్థకులతిలకుండు వానరశ్రేష్ఠపరివృతుండై పాపకర్ముం డగు
రావణిం బరిమార్చుటకుం దగినవేగం బంగీకరించి గుణంబు సారించిన నమ్మహా
త్ముమనం బెఱింగి రావణనందనుండు రణంబు సాలించి రయంబునం బురంబు
ప్రవేశించి బలవంతు లగుకుంభకర్ణాదిరాక్షసవీరులనిధనంబు దలంచి క్రోధతా
మ్రేక్షణుండై యేరీతినైన సర్వవానరసమన్వితంబుగా రామలక్ష్మణుల వధించెద
గాక యని నిశ్చయించి యచ్చట నిలువక కతిపయబలంబులం గూడి పశ్చిమ
ద్వారంబున వెడలి వచ్చి యుద్ధంబునకు సముద్యతు లైనరామలక్ష్మణుల సమ
ద్యోగంబు సూచి స్వగమనవిఘాతంబుగా నెంచి తన్నివారణార్థంబు ......
మోహకారిణి యైనమాయ నవలంబించి మోహనార్థంబు మాయాసీతం
గావించి రథంబుపై నిడుకొని తద్వధవ్యవసితుం డై గ్రమ్మఱఁ బురంబు వెడలి
వానరుల కభిముఖంబుగాఁ జనుదెంచుచున్న నతని విలోకించి వానరులు సంక్రు
ద్ధులై శిలాపాదపంబులు గైకొని రణంబున కడరి రప్పు డాంజనేయుం డొక్కండు

హనుమంతుం డింద్రజిత్తునిమీఁది కడరుట

దురాపదం బైనపర్వతంబు గొని వానరులం దలకడచి శక్రవైరి మార్కొనం
బోవుచు వానిరథంబుమీఁద నెడతెగగ వెడలువేఁడినిట్టూర్పులఁ గంది
మిక్కిలి కృశం బైనశరీరంబును గమలపత్రంబులఁ బోలుకన్నులం దొరఁగు
బాష్పజలంబును జడకట్టుకొని యున్నమలినంబు లగుశిరోజంబులును ధరణి
రజోలిప్తసర్వాంగంబును విన్ననైనవదనంబును గరపల్లవంబు గదిసినచెక్కును
మాసినవలువయుం గలిగి రామవిరహానలంబు వెక్కసంబుగా నిక్కిన నాహార
నిద్రలు దొఱఁగి తుది లేనిశోకంబు నొందుచున్నదానిచందంబున గాలిం
దూలి కదలువనలతకైవడి నాకంపించుచున్న మాయాసీత నవలోకించి యొక్క
ముహూర్తంబు తద్రూపవిశేషంబు లన్నియుఁ బరామర్శించి యచిరకాలదృష్ట
త్వంబువలన నిక్కంబుగా సీత యని నిశ్చయించి వీఁ డిద్దేవి నేమి సేయం దలంచి
కొని దెచ్చినవాఁడొ యని చింతించి శోకంబు పెంపున బాష్పవ్యాకుల
ముఖుండై సర్వవానరసమేతంబుగా రయంబున వానిపై నురవణించిన నయ్యిం
ద్రజిత్తు వాయునందనాదికపుల నిరీక్షించి మీరేల బరవసంబునం జనుదెంచెద
రెద్దానికై పోరెద రట్టిసీత యిదె చూడుఁడు దీని తల ద్రెవ్వనేసెద నని పలికి
వ్యాఘ్రంబుకడ లేడిపొలువున వడంకుచు నయనాంబుజంబులు బాష్పంబు