Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/680

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్కన నిటు దృష్టిగోచరుఁడు గాక తమోవృతుఁడై పురందరా
శనినిభభానుభానుసమసాయకము ల్నిగిడించి రాఘవేం
ద్రుని నిఖిలాంగమర్మములు నొవ్వఁగఁ జేసె మహాద్భుతంబుగన్.

1789


తే.

అంబుధారలచేఁ బర్వతంబుకరణి
నసురవరతీవ్రనారాచహన్యమాను
లయ్యు రాఘవు లొక్కింత యైన సరకు
గొనక కృతచాపశింజినీఘోషు లగుచు.

1790


చ.

నిరుపమవిక్రమం బడర నింగికిఁ జూడ్కులఁ బర్వఁ జేసి వి
స్ఫురదురుకంకపత్రమణిపుంఖశితాంబకము ల్వరాస్త్రముల్
పఱపిన వానిఁ దాఁకి వెస భగ్నములై తదమోఘబాణముల్
వరుస నికృత్తభోగఫణిపంక్తులపై వడిఁ గూలె నుర్వరన్.

1791


ఉ.

వ్రేటునఁ బుట్టుకోపమున వీర్యము తేజము వృద్ధిఁ బొంద దో
షాటకులోత్తముండు వివిధాననతిగ్మసువర్ణపుంఖక
ర్కోటకసన్నిభప్రదరకోటులఁ బైఁ బరగించె సంతతో
ద్ఘాటనితాంతమౌర్వినినదంబు లజాండము వ్రయ్యఁ జేయఁగన్.

1792


క.

తక్కక తద్విశిఖంబుల, నక్కజముగ హన్యమానులై నృపసూనుల్
స్రుక్కక పటుభల్లంబులఁ, జక్కలు వాపిరి తదీయశాతశరములన్.

1793


ఉ.

దానికి నల్గి రావణి ప్రతాప మెలర్చఁగ విల్లు వంచి మౌ
ర్వీనినదంబు పెల్లెసఁగ వెక్కస మైనప్రచండకాండముల్
వే నిగిడింప వజ్రసమవేగములై యవి రాఁ దొడంగె మి
న్నీనినమాడ్కి భాస్కరకులేంద్రులమీఁదికి సేనమీఁదికిన్.

1794


క.

ఏచాయఁ గన్న దృష్టి క, గోచరుఁడై చిత్తజల్లు గురిసినక్రియ దో
షాచరనాథసుతుఁడు నా, రాచపరంపరలు పఱపె రామునిమీఁదన్.

1795


క.

ఏవంకఁ బాఱఁ జూచిన, నావంకం గురియు సాయకాసారం బా
రావణనందనశరవి, ద్యావిభవం బింత యనుచు నలవియె పొగడన్.

1796


మ.

శరజాలంబులు గూర్చి యేయుటకు హస్తం బెత్త రాకుండఁ బు
ష్కరవీథిం దనయునిఁ జూచుటకు వక్త్రం బెత్త రాకుండ భీ
కరలీల న్ధరకు న్నభంబునకు నేకత్వంబు గల్గ న్లస
చ్ఛరము ల్వే నిగిడించె నొక్కమొగిఁ బర్జన్యుండు వృష్టింబలెన్.

1797


సీ.

ఒకవంకఁ గోదండ ముద్ధతి మెఱయించు నొకచోటఁ దిగ్మసాయకము లేయు
నొకచాయ హరిభంగి హుమ్మని ఘోషించుఁ గడువడి నొకక్రేవఁ గానిపించు
నొకయోరఁ జిత్రయుద్ధోద్యోగ మొనరించు నొకదెసఁ గురియించు నుపలవృష్టి
నొకదారిఁ దననామ మకలంకృతిఁ జెప్పు నొకయెడ నదలించు నుగ్రలీలఁ