Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/679

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భ్యాశగతాద్రికందరములందుకు డాఁగిరి కొంద ఱార్తులై.

1780


ఉ.

ఆయసురేంద్రుఁ డిట్లు విపినాటులఁ గాండముల న్బడల్పడం
జేయుచు వచ్చి యొక్కెడఁ ద్రిశృంగయుతాద్రులభంగిఁ బొల్చి యా
చాయకు డాయకుండ శరజాలము లేయుచు రౌద్రమూర్తులై
పాయక సైన్యమధ్యమున భాసిలుచున్ననరేంద్రసూనులన్.

1781


ఉ.

చూచి నిజంబు వీరె నృపసూను లటం చటు నిశ్చయించి దో
షాచరవంశశేఖరుఁడు చాపము సజ్యము చేసి ఘోరనా
రాచపరంపర ల్పలుదెఱంగులఁ బైఁ బరఁగించె జన్యవి
ద్యాచతురత్వ మేర్పడ లయాభ్రము దారుణవర్షముం బలెన్.

1782


తే.

మఱియు నానైరృతుఁడు దివ్యమంత్రశక్తి
రథముతోఁ గూడ గగనమార్గమున కెగసి
సంచరించుచు దృష్టిగోచరుఁడు గాక
ఘోరశతకోటినిభశరకోటిఁ బంచె.

1783


క.

పెనువెల్లువకైవడి వడిఁ, జనుదెంచుసురేంద్రవైరిచాపవిముక్త
స్వనయుక్తశరౌఘం బా, ఘనులకు వారింప నలవి గాకుండె ననిన్.

1784


ఉ.

ఏమని చెప్పవచ్చు నసురేంద్రకుమారుఁ డొనర్చు ఘోరసం
గ్రామవిధంబు తన్నిశితకాండకృతవ్రణజాతరక్తధా
రామిళితాంగులై మనుజరాజులు జేవుఱుటేర్లతోడి యు
ద్దామనగంబులో యనఁగఁ దద్దయుఁ జూడఁగ నొప్పి రయ్యెడన్.

1785


ఉ.

అంత నొకింతసేపునకు నారఘువర్యులు ధైర్య మూఁది కా
లాంతకదండతుల్యవివిధాంబకము ల్వెస వింటఁ గూర్చి రో
దోంతర మెల్ల నిండ రయమార నిగిడ్చి దశాస్యసూతిపైఁ
బంత మెలర్ప దీవ్రపటుబాణచతుష్టయ మేసి రుద్ధతిన్.

1786


ఉ.

ఆరజనీచరేంద్రుఁడు దురంతనిశాచరమాయఁ బన్ని యే
పారఁగ దిఙ్నభోగత సమస్చతరాచరభూతజాలముల్
సూరెల నెవ్వియు న్వెదకి చూచినఁ గన్పడకుండ సాంద్రనీ
హారమనాంధకారతమ మద్భుతభంగి సృజించె నుద్ధతిన్.

1787

ఇంద్రజిత్తు రామలక్ష్మణులమీఁద బాణవర్షము గురియుట

తే.

కదిసి జడివాన గురియుమేఘంబులోని
స్తనితములభంగి రథనేమిచాపనిస్వ
నములు విన వచ్చుఁ గాని తత్తిమిరమందుఁ
గాన రాదయ్యె నింద్రారికాయ మపుడు.

1788


చ.

దనుజవరేణ్యపుత్త్రుఁడు పితామహదత్తవరుండు గానఁ జ