Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/678

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రతిష్ఠించి రక్తమాల్యాంబరాభరణగంధాలంకృతుండై మౌంజీదండోపవీతం
బులు దాల్చి యచట ఖట్వాంగధ్వజంబు నిలిపి కపాలాసనారూఢుండై స్రుక్స్రు
వంబులును రక్తంబు నినుపపాత్రల నిడి త్రికోణాకారనిర్మిత యైనవేదికి దక్షిణ
భాగంబునం బెట్టి మౌనంబు ధరియించి యధర్వణమంత్రంబు లుచ్చరించుచు
నయోమయంబు లగుస్రుక్స్రువంబులఁ బట్టి తాఁడిసమిధలును దిలలును నర్షపం
బులును జరువును హోమంబు చేసి హోమాంతంబునందు జీవయుక్తం బైనకృష్ణ
చ్ఛాగగళంబు కరవాలంబునం దెగవ్రేసి పూర్ణాహుతి గావించిన నయ్యగ్నిదే
వుండు విధూమప్రదక్షిణావర్తశిఖుండై విజయలక్షణంబులు తేటపడ వెలుం
గుచు హవ్యంబులు ప్రతిగ్రహించి తప్తహాటకసన్నిభుండై కుండంబువలన వెల్వడి
పొడసూపి దివ్యరథంబును దివ్యాస్త్రంబులును దివ్యకవచంబును దివ్యచాపంబు
నొసంగిన నమ్మహనీయరథం బారోహించి కంకటంబు దొడిగి తూణీరంబు బిగిం
చి చాపంబు గైకొని నారి సారించుచు బ్రహ్మాండకర్పరంబు పగుల సింహనా
దంబు చేసి శంఖం బొత్తి దివ్యమణిమండనరోచులు దిక్కులం బిక్కటిల్ల రాక్ష
సాంగన లిరుగెడలఁ జారుచామరంబులు వీవఁ బాండరచ్చత్రంబు శీర్ఘోపరిభాగం
బున నలర భేరీనిస్సాణధణంధణశబ్దంబులు బోరుకలఁగ శతాంగిమాతంగతు
రంగపదాతివర్గంబు లనేకంబులు వెన్నాడి నడువ రణోత్సాహ మాననంబునం
జెలంగ నమోఘప్రతాపదీపితుండై వివిధాట్టహాసపూర్వకంబుగా రణంబునకు
వెడలి యుద్ధభూమికిం జనుదెంచునపుడు సమారోపితమహాచాపం బై వాజి
చతుష్టయయుక్తంబై తపనీయపరిచ్ఛదం బై సౌవర్ణవలయశోభితం బై యంతర్ధాన
శక్తియుక్తం బై దీప్తపావసన్నిభం బై చంద్రార్ధచంద్రాకారరచనావిశేషనారాచ
శోభితం బై వైడూర్యకేతుసమాలంకృతం బై బాలభానునిచందంబునం దేజ
రిల్లుచున్న శక్రజిత్తురథంబు దవ్వులం జూచి వానరులు భయభ్రాంతచిత్తులై
రప్పు డాయింద్రజిత్తు రథంబుతోడ నాకాశంబున కెగసి రాక్షసుల నందఱ
నవలోకించి యిట్లనియె.

1777


ఉ.

నేఁడు రణంబులోన రజనీచరులార నృపాలవుత్రుల
న్వాఁడిశరంబులం దునిమి వాలిజవాయుజముఖ్యకీశులం
బోఁడిమి మీఱ గీటణఁచి భూమి నవానరఁ గా నొనర్చి బ
ల్వేడుకతోడ సౌఖ్యపదవి న్జయ మిచ్చెద దైత్యభర్తకున్.

1778

ఇంద్రజిత్తు వానరులమీఁదఁ బలుదెఱంగుల బాణవర్షము గురియుట

క.

అని పలికి యదృశ్యుండై, వినువీథిం దిరిగి వచ్చి విబుధరిపువరుం
డనుపమశరవర్షంబును, వనచరతతిమీఁదఁ గురిసె వనదముమాడ్కిన్.

1779


ఉ.

ఆశరవృష్టికిం దలఁకి యాస్యము నెత్తఁగ లేక భీతులై
కీశులు కొంద ఱంబునిధిక్రేవకుఁ బాఱిరి కొంద ఱాజివి
ద్యాశరధి న్మహాశరధి దాశరథి న్శరణంబు వేఁడి ర