650 గోపీనాథ రామాయణము గొనకొని తత్సమీపమునకుం గొని తెచ్చిన నాతఁ డంత స్యం దనమునకుం బ్రదక్షిణ మొనర్చి రయంబున దాని నెక్కి సూ తునిఁ గని చెచ్చెర శ్రథము దోలుము నీవని పల్కి యుద్ధతిన్. సీ. అసురులఁ జూచి మీ రందఱుఁ గడు సాహసంబునఁ గపులతో సంగరంబు గావింపుఁ డేను రాక్షసనాథుఁ డగుజశకంఠుచే రామలక్ష్మణుల వధము నందు నియుక్తుఁడ నైతిఁ గావున నేఁడు కడువడి వారిపై నడరి తీవ్ర శరముల వధియించి శాఖామృగస్వామి సుగ్రీవుఁ దెగటార్చి యుగ్రభంగిఁ తే. నవల వైశ్వానరుండు కాఱడని నేర్చు, కరణి వానరసైన్యసంఘముల నాక్ర మించి భుజగర్వమున విజృంభించి విశిఖ,శిఖ దహించెద దానవశ్రేష్ఠులార. అసత్యం. మకరమున కశుభనిమి త్తంబు లగపడంట. పురం 1788 న అని పలికిన నమ్మక రాక్కునివచనంబు విని బలవంతు లగురాక్షను లందఱుఁ గా మరూపధరులై నానాయుధోపేతులై సమాహితులై పింగళేక్షణులై మదోన త్తులై యుద్ధాభికాంకులై దంష్ట్రాకరాళవదనులై భయంకరాకారులై మత్త మాతంగంబులభంగి ఘీంకారంబులు సేయుచు భుజాస్ఫాలనంబు గావించుచు నభూతపూర్వ తేజోవి శేషంబునం గ్రాలుచునమరసన్నాహసంరంభ విజృంభితులై మహా కాయుం డగుమక రామునిం బరివేష్టించి సమాహతశంఖ కాహళ భేరీని నా ద పురస్సరంబుగా నట్టహాసంబున రణంబునకు వెడలి రప్పు డాకస్మికంబుగా సారథికరంబుననుండి ప్రతోదంబు జాతి పుడమిం బడుటయు ఖరపుత్రునిరథంబు పై నెత్తిన మణిధ్వజంబు విఱిగి కూలుటయు రథసంయు కంబు లగుహయం విక్రమవర్ణితంబులై దీనముఖంబులై కన్నీరు నించుచుఁ జరణంబులు తడఁ బడం జనుటయుఁ బవనుండు ఖరదారుణుండై పాంసయుక్తంబుగా వీచుటయు నివి మొదలుగాఁ గలదుర్నిమిత్తంబు లనేకంబులు విలోకించియు వీరస త్తము లగుటంజేసి చింతింపక గజమహిషాంగతుల్య వర్ణులగురాల్ను లేన యేన తల మిగిలి వానరులం బరిమార్చెద నని పంతంబులు పలుకుచుఁ జరణసంఘట్ట నంబున మహీతలంబు కంపింపంజేయుచు సతిసమ్మర్దంబుగాఁ ద్రోచి నడిచి రంత. ఉ. ఆజికి నిట్లు వచ్చుమక రాముని దవ్వులఁ జూచి రుష్టులై భూజచర ప్రవీరులు చమూపతి చోదితులై రయంబున రాజితవృక్ష సంఘములు తాళ్లు కరంబులఁ గ్రాలఁ గ్రావ్య భు ర్రాజులతోడ ఘోరససురం బొనరింపఁగఁ బూని రయ్యెడన్, ఉ. వారలఁ జూచి రాక్షసులు వారక రోషపరీతచిత్తులై దారుణభంగి దాఁకి రిటు తప్పక ము న్నల దేవదానవుల్ చేరిన మాడ్కి నయ్యుభయసేనలవారును జేరి వీఁకతోఁ బోరిరి సింహనాదములు భూరిపరాగము నింగి ముట్టఁగన్. 1736 1787
పుట:గోపీనాథరామాయణము2.pdf/673
స్వరూపం