Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నెక్కడఁ గాన మాతనిపయిం దెగు టొప్పునె నీకు జెల్లునే
చక్కగ దాసమానముఖసత్కృతుల న్వెలయింపు మింపుగన్.

386


క.

నీ విపు డనుగ్రహించిన, భావంబునఁ బొంగి వైరభావ ముడిగి సు
గ్రీవుఁడు ముదమున విపుల, గ్రీవుండై కొలిచి యుండుఁ గేవలభక్తిన్.

387


వ.

దేవా వాని కిప్పు డొండు శరణంబు లేదు గావున హితైషిణి నగునామతం బం
గీకరించి ప్రసన్నుండ వై భ్రాతృసౌమనస్యం బవలంబించి రోషంబు పరిత్యజించి
శాంతి వహించి శక్రసమానతేజుం డగురామునితోడివిగ్రహంబునకుం జొరక
సుగ్రీవుని యౌవరాజ్యంబున కభిషిక్తుం జేసి యతండును నీవును బరస్పరబద్ధా
నురాగంబులం గలసి మెలసి సుఖం బుండుం డని పలికిన.

388

వాలి రోషమునఁ దారను దర్జించుట

క.

తారాధిపనిభముఖి యగు, తారహితోక్తులకుఁ జాలఁ దర్జించుచు వృ
త్రారిసుతుఁ డంతకాలము, చేరువయై యుంటఁ జేసి చిడిముడిపడుచున్.

389


ఉ.

తా నొకపోటుబంటువలె దర్ప మెలర్పఁగ వచ్చి పిల్వఁగా
నే నటు పోక తద్వికృతి నెట్లు సహించి రణానివర్తికి
న్మానితశౌర్యశాలి కభిమానికి వైరికృతావమాన మ
బ్జానన చావుకంటె ధర నక్కట యెక్కుడు కాదె చూడఁగన్.

390


క.

అని సేయుకౌతుకంబునఁ, జనుదెంచి మదస్వనంబు సలిపెడు భాస్వ
త్తనుయునిపటుసంరంభము, వనితా యే నెట్లు సైఁచువాఁడం జెపుమా.

391


తే.

కాంత మత్కృతమందు రాఘవునిఁ గూర్చి
యుమ్మలింపఁగ నీకుఁ గార్యమ్ము గాదు
ధర్మవిదుఁడు కృతజ్ఞుఁడు నిర్మలాత్ముఁ
డమ్మహామహుఁ డిల పాప మ్మొనర్చు.

392


చ.

ఎఱుఁగక యిట్లు పల్కఁ దగవే మగువా సతిసౌహృదంబుచేఁ
గఱపితి దాని కేమి బలఘస్మరుఁ డైనఁ గొఱంత లేదు నా
తెఱఁగును సత్త్వసంపదయు ధీరతయు న్మును నీ వెఱుంగవే
మరలుము మాఱుమా టనక మానవతీ వనితాయుతంబుగన్.

393

వాలి సుగ్రీవునికడ కేగుట

వ.

ఏను రయంబునం జని సుగ్రీవుని డాసి ప్రాణంబులఁ గొనుటకుం దెగక కాష్ఠ
ముష్టిప్రహారంబుల నేర్పున దర్పం బువసంహరించి వచ్చెద నతండు మదీయపాణి
ప్రహారపీడితుండై తొల్లింటివడువునఁ బాఱంగలండు నీ వంతపురంబునకుం జను
మింక భూఱు పలికితి వేని మదీయప్రాణంబులచేత శాపిత వయ్యెద వనిన నద్దేవి
యతని గొఁగిలించుకొని మందంబుగా రోదనంబు సేయుచుఁ బ్రదక్షిణంబుఁ
జేసి విజయంబు దొరకొనుటకు మంత్రపూర్వకంబుగా స్వస్త్యయనం బొసంగి
శోకమోహితయై మరలి మరలి చూచుచు నంతఃపురంబునకుం జనియె నిత్తెఱం