Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/661

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

కుప్పరవీథినుండి రభసోద్ధతి నార్చుచు బాహ్యభూమి కా
చొప్పున నిర్గమించుటయుఁ జూచి వనాటులు చాలఁ గ్రుద్ధులై.

⁠ 1644


క.⁠

వారిదములక్రియ నార్చుచు, వారలఁ దలపడిన నసురవానరవీరో
దారధ్వనులు నభంబును, ధారుణియును దిశలు నిండ దళముగ మ్రోసెన్.

⁠ 1645


తే.⁠

మానుగ విశల్యు లైనమహానుభావు
లానరేంద్రులు సంభ్రాంతులై విశాల
చాపములు రెండు గైకొని యేపు మీఱ
నుగ్రమూర్తు లై చూపట్టు చుండి రపుడు.

⁠ 1646


ఉ.⁠

చండపరాక్రమార్జితయశఃపరిపూర్ణుఁడు రాముఁ డంతఁ గో
దండము నెక్కు వెట్టి విదితంబుగ మౌర్వి రవం బొనర్చినన్
మెండుగ నమ్మహాధ్వని తమీచరకీశరవంబు మ్రింగి పె
న్గొండలు నిండి దానవులగుండెలు వ్రక్కలువాపె నెంతయున్.

⁠ 1647


తే.⁠

కార్ముకము కేలఁ దాల్చి రాఘవుఁడు గనలి
వేదమయమైన బలితంపువిల్లుఁ దాల్చి
నట్టిలయకాలరుద్రుఁడో యనఁగ నపుడు
చాలఁ జూపట్టె వనచరు ల్సంతసింప.

⁠ 1648


క.⁠

వానరులకలకలంబును, దానవులమహాస్వనంబు దశరథతనయ
జ్యానాదం బొక్కటి యై, భూనభములు దిశలు నిండి బోరన మ్రోసెన్.

⁠ 1649

రావణుఁడు కుంభనికుంభాదుల యుద్ధమునకుం బంపుట

వ.⁠

ఇట్లు సమరసంరంభవిజృంభితుం డై రాముండు నిశితంబు లగుశరంబులు నిగి
డించి కై లాసాచలశిఖరసన్నిభం బైనతత్పురగోపురంబు నేలం గూల్చిన నవ్వి
ధం బాలోకించి చర్యాగృహవిమానంబులం దున్నరాక్షసులు సన్నద్ధులై
సింహనాదంబు సేయుచుఁ బురంబు నిర్గమించి రణభూమికిం జనుదెంచుచున్న
వారలం జూచి సుగ్రీవుండు వానరుల కాజ్ఞాపించిన వా రతిత్వరితగమనంబునం
జని లంకాద్వారంబు లాక్రమించిన నయ్యిరుదెసలవారి కారాత్రి కాళరాత్రి
యై తోఁచె నత్తెఱం గంతయు విని రావణుండు క్రుద్ధుండై రణసన్నద్ధుం డై
జృంభితవిక్షేపంబువలన దిశాజాలంబు వ్యాకులం బై వడంక విలయకాలరుద్రు
నిరూపంబు రూపవంతం బైనదొకో యనఁ గనుపట్టుచుఁ గుంభకర్ణనందనులైన
కుంభనికుంభుల ననేకరాక్షసపరివృతులం జేసి రణంబునకుం బొమ్మని పలికి పదం
పడి యూపాక్షశోణితాక్షప్రజంఘకంపను లనువారి నల్వుర యోధాగ్రేసరులఁ
గుంభనికుంభులకు బాసటగా ననిచి వారల నిరీక్షించి మీరు మచ్చాసనంబునం
జని పగతుల నిర్జించి జయంబు గొని యభిజ్ఞానంబుకొఱకు సింహనాదంబులు
గావింపుఁ డని పలికి నముచితంబుగా వీడుకొల్పిన నయ్యాతుధానయోధు

⁠