| |
దనుల బలాధినాథులఁ బ్రధానుల మిత్రుల నందఱ న్మనం
బునఁ దలపోసి దుఃఖమున మోహమున న్మనతోడ సంగరం
బున కిపు డేగుదెంచుటకుఁ బూనఁడు గావున వాని కీయెడన్.
| 1630
|
| చ. |
అలుక జనించునట్లుగ బలాఢ్యులు శూరులు వీర్యవిక్రమో
జ్జ్వలులు ప్రచండవేగు లగువానరవీరులు ధీరులై మహో
ల్కలు గొని లంకమీఁదికిఁ జలంబున నేగి దహించువారుగా
నలఘుచరిత్ర నీ వతిరయంబున నానతి యిచ్చి పంపుమా.
| 1631
|
| చ. |
అని యరవిందమిత్రసుతుఁ డాడిన నట్లగుఁ గాక యంచు న
య్యనిలసుతుండు యూథపుల కందఱ కవ్విధమంతఁ దెల్పఁగా
విని కపివీరు లుల్కలు ప్రవీణతఁ గైకొని నిర్విశంకు లై
చనిరి ప్రచండవైఖరి నిశాసమయంబున లంకమీఁదికిన్.
| 1632
|
| శా. |
ఈరీతిం బటుగుల్మమందిరగతాహీనాసురు ల్భీతు లై
పాఱ న్దారుణభంగి మ్రోయుచుఁ గపు ల్పాటించి లంకాపురిం
జేరం బోయి తదీయగోపురగృహశ్రేణీవిమానప్రతో
ళీరేఖావరచర్యలందు ఘనకీలిం గొల్పి రొక్కుమ్మడిన్.
| 1633
|
వానరులు లంకాపురిని దహించుట
| వ. |
ఇట్లు వానరవిసృష్టుం డై యవ్వీతిహోత్రుండు విలయపవనప్రేరితసంకర్షణాగ్ని
చందంబున మండి గగనచుంబిశిఖాపరంపరుం డై విస్ఫులింగపటలీసంచార
భీకరుం డై మింటం బొగ లెగయ శుష్కారణ్యంబు నేర్చు కార్చిచ్చువడువున
నయ్యాతుధానరాజధానిం జుట్టుముట్టుకొని మహోన్నతపర్వతాకారంబు లైన
విమానగోపురప్రాసాదహర్మ్యమందిరంబులు దహించుచు వరాగరుహరిచంద
నంబులును సుస్నిగ్ధమణిముక్తాఫలకంబులును వజ్రంబులును ప్రవాళంబులును
రమ్యంబు లగుక్షౌమంబులును శోభనంబు లగుకౌశేయంబులును నవిరోమనిర్మిత
పటంబులు నూర్ణామేషాదిలోమనిర్మితకంబళాదికంబును గాంచనోపకరణంబు
లును వరాయుధసంచయంబులును ననేకవిచిత్రవిన్యాసతురంగాలంకారపల్యయ
నాదిపరికరంబులును సమ్యగ్గ్రథితంబు లైనరథోపకరణంబులును గజగ్రైవేయ
కక్ష్యాసంచయంబును వరయోధులతనుత్రాణంబులును వాజివరణవర్మంబులును
ఖడ్గంబులును జామరంబులును గుణంబులును నాయకంబులును దోమరాంకుశ
శక్తులును రోమజన్యకంబళాదికంబును వ్యాఘ్రచర్మంబును గస్తూరికాదిపరిమళ
ద్రవ్యంబులును ముక్తామణివిచిత్రప్రాసాదసహస్రంబులును నానావిధాస్త్రసం
ఘంబును బహువిధస్వస్తికాదిగృహసన్నివేశవిశేషంబులును భస్మంబు గావిం
చుచు హేమవిచిత్రతనుత్రాణులును మాల్యదామాంబరధారులును శ్రీధుపాన
చలాక్షులును మదవిహ్వలగమనులును గాంతాలంబితవస్త్రులును శత్రుసంజా
తమన్యులును గదాశూలాసిహస్తులును మహార్హశయనప్రసుప్తులును బ్రియా
|
|