Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తుల నక్కొండఁ బరిగ్రహించుకొని యెంతో ప్రీతితో నమ్మహా
బలసూనుండు నభంబునం జనియె సౌపర్ణాగ్ర్యవేగంబునన్.

1626


చ.

రవినిభ మైనశైలశిఖరం బటు గ్రక్కునఁ గేలఁ బూని యా
రవినిభతేజుఁ డైనకపిరాజసఖుండు మరుత్కుమారుఁ డా
రవిపథ మంటి వాయుగతి రామునిఁ జేరఁగ నేగునప్డు త
త్సవితృనిక్రేవఁ దోఁచెఁ బ్రతితామరసప్రియుఁడో యన న్రహిన్.

1627


క.

కరకలితశిఖిశిఖాసం, భరితసహస్రారఘోరపటుచక్రముచే
హరివోలె గిరినిభుం డా, హరినాయకుఁ డప్పు డొప్పె నగ్గిరిచేతన్.

1628

ఓషధీగంధాఘ్రాణంబున వానరసహితంబుగా రామలక్ష్మణులు విశల్యు లగుట

వ.

ఇట్లు దివ్యౌషధీపర్వతంబు గొని యమోఘరయంబునం జనుదెంచుచున్నహను
మంతుని దవ్వులం జూచి వానరు లంద ఱొక్కమొగి సింహనాదంబులు గావిం
చిరి వారలం జూచి యమ్మరున్నందనుండును సంతోషవిశేషంబున నిజవిజయంబు
తేటపడునట్లుగా నొక్కమహాస్వనంబు చేసె వారలసముద్ఘృష్టరవంబులు విని
లంకామలయనివాసు లగురాక్షసులందఱు భీమతరంబుగా నినాదంబులు గావించి
రంతలోన నమ్మహాత్ముం డప్పర్వతంబు గొని తెచ్చి వానరసైన్యమధ్యంబున నిలిపి
జాంబవదాదివానరోత్తములకు భక్తితో నభివందనంబుఁ జేసి విభీషణునిం
గవుంగిలించె నంత నమ్మహౌషధిగంధం బాఘ్రాణించి మానుషరాజనందను
లగు రామలక్ష్మణులు విశల్యు లైరి మఱియు రణంబున నిహతు లైనహరివీరులంద
ఱును దత్క్షణంబ తద్దివ్యౌషధిగంధంబున విశల్యులును విరుజులునై సుప్తులైన
వారు నిశాంతంబునం బ్రబుద్ధు లైనచందంబున నందంబు వహించిరి యుద్ధా
రంభదినం బాదిగాఁ బ్రతిదినంబును రణంబునఁ గపికుంజరులచేత నిహతులైన
రాక్షసుల నందఱ విచారించి తత్పరిగణనార్థంబును రాక్షసు లనేకులు నిహతు
లై రని సర్వజనంబు లెఱుంగుదు రనియెడు దురభిమానంబునను మృతు లైనరా
క్షసుల నందఱ నిత్యంబును సముద్రంబులో వైవుం డని రావణుం డానతిచ్చు
టం జేసి తత్ప్రకారంబున మృతరాక్షసుల నెల్ల రాక్షసు లుదధిలో వైచినవారు
గావున నక్కాలంబున దివ్యౌషధిగంధాఘ్రాణంబుఁ జేసి గ్రమ్మఱ బ్రతుకుటకు
రాక్షసుండొక్కండైన లేఁడయ్యె నిట్లు మారుతపుత్రుం డోషధిప్రదానంబున
రామలక్ష్మణసహితంబుగా వానరుల నెల్ల విశల్యులం జేసి మృతులైనవారినెల్లఁ
బునస్సంజీవితులం గావించి యమ్మహౌషధిపర్వతంబు నెప్పటిచోట వైచి గ్రమ్మ
ఱఁ జనుదెంచి కృతార్థుం డై రామునిసమీపంబునకుం జనియెనంత వానరా
ధిపుం డగుసుగ్రీవుండు హనుమంతు నవలోకించి కర్తవ్యకార్యంబు తెలియం
జేయుచు ని ట్లనియె.

1629

సుగ్రీవుఁడు వానరులకు లంక దహింప నాజ్ఞాపించుట

చ.

అనిలకుమార పంక్తిముఖుఁ డాలమునం దెగి కూలినట్టినం