| |
భంగి నింగి వెలుంగుచుఁ బ్రదీప్తాంతకకాలకల్పం బై గరుడానిలతుల్యవేగం
బున నతికాయునిమీఁది కడరిన విలోకించి యయ్యసురపుంగవుం డవిపన్నచిత్తుం
డై రయంబున.
| 1556
|
| చ. |
పరశుగదాసికుంతములు ప్రాసపరశ్వథశక్తిశూలము
ద్గరము లనేకము ల్పఱపఁ జయ్యన నప్పరమాస్త్ర ముద్దతి
న్మెఱయుచు వాని నన్నిటిని మ్రింగుచు వేల్పులు చూచి మెచ్చ భీ
కరగతి మీఱ నేగి యతికాయునిశీర్షము ద్రుంచి వేల్మిడిన్.
| 1557
|
రావణుఁ డతికాయాదులమరణంబు విని విలపించుట
| వ. |
ఇత్తెఱంగున సశిరస్త్రాణం బైనయతికాయునిశీర్షంబు లక్ష్మణబాణప్రమర్దితం బై
విక్షప్తభూషణం బై హిమవత్పర్వతశిఖరంబుకరణి శీఘ్రంబున మహీతలంబునం
బడియె దాని విలోకించి హతశేషు లగురాక్షసులు భయభ్రాంతచిత్తు లై లంక
కుం బాఱి రప్పుడు వానరు లందఱు హర్షవిశేషంబునం బొదలుచుఁ బ్రబుద్ధ
పద్మప్రతిమానవదనులై యిష్టభాగి యగులక్ష్మణుం బూజించి రంత మహాతేజుం
డగులక్ష్మణునిచేత నెనిమిదవనాఁటియుద్ధంబున నతికాయుండు హతుం డగుట
విని రావణుండు పరమోద్వేగంబు నొంది యి ట్లనియె.
| 1558
|
| సీ. |
ఇంద్రాదిదివిజులఁ బృథుబాహుబలమున నాజి నోర్చినవిరూపాక్షుఁ డీల్గె
గులశైలముల నైన నులిమి వైవఁగఁ జాలు శూరుండు వజ్రదంష్ట్రుండు మడిసె
నరుదార మృత్యువు నైన లెక్కింపనిఘనతేజుఁ డాయకంపనుఁడు గెడసె
సకలరాత్రించరసైన్యనాయకుఁ డైనచండవీర్యుఁడు ప్రహస్తుండు చచ్చె
|
|
| తే. |
దండితారాతి కుంభకర్ణుం డడంగె
దండధరసన్నిభుఁడు మహోదరుఁడు గ్రుంగె
నసురమౌళి మహాపార్శ్వుఁ డంత మొందె
శౌర్యధుర్యుండు ధూమ్రలోచనుఁడు పొలిసె.
| 1559
|
| తే. |
మఱియు నసమానశౌర్యులు మాననీయ
మహితతేజులు ధీరులు మత్కుమారు
లధికులు నరాంతకుండు దేవాంతకుండు
త్రిశిరుఁ డతికాయుఁ డాజిలోఁ దెగిరి నేఁడు.
| 1560
|
| ఆ. |
నాదుచండశాసనమున నాజి కరిగి, వీరుఁ డైనరామవిభునిచేత
హరులచేతఁ జచ్చి రసురు లనేకులు, శైలయోధు లధికశస్త్రవిదులు.
| 1561
|
| క. |
జేతలు పరసైన్యములకు, నేత లసురసైన్యములకు నిత్యాజితు లా
ఖ్యాతబలపౌరుషులు ఘన, దైతేయులు చచ్చి రెంతతక్కువ యయ్యెన్.
| 1562
|
| చ. |
నిరుపమతేజు లైనరజనీచరు లెవ్వనిచేతఁ జచ్చి రా
నరపతి యైనరాముని రణంబున భ్రాతృబలాన్వితంబుగా
|
|