Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/643

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

620 గోపీనాథ రామాయణము 1588 నందు శరంబులు సంధించి యద్భుతప్రకారంబున సతికాయునిమీఁద నడరె నతండును హేతుమంతంబును బరమార్ధవంతంబు నైన లక్ష్మణునివాక్యంబు విని సక్రోధుం డై చాపారోపితో త్తమబాణుం డై యాఁకటితో నున్న సింగంబుపైఁ గవియుమ త్తేభంబుచాడ్పున నవ్వీరశిఖామణిం దలపడియె నప్పు డయ్యతిరథ శ్రేష్ఠులయా॰యోధనంబు గనుంగొనువాంఛం జేసి దేవదాస వగంధర్వవిద్యాధర సిద్ధ సాధ్య గరుడోరగ గుహ్యకులును మహాత్ములగుపరమర్షులును దివ్యయానా కూడు లై చనుదెంచి గగనంబునం బన్ని విలోకించుచుండి రంత. మ. కుపితుం డై దశకంఠపుత్రుఁడు మహాకోదండమార్వీరనం బవు డాకాశము నిండి మ్రోయ నొక సర్పాకారవజ్ఞోప మో గ్రపృషత్కం బరిఁబోసి వేగ చెవి సోఁకం దీసి గట్టల్క నా నృపవర్యాత్మ జుమీఁద నేసెఁ బటుదోర్వీర్యం బవార్యంబుగన్. తే. అంబరంబునఁ జను దెంచునయ్య మోఘ, దారుణాశీనిపోపమోద గ్ర శరము అర్ధ చంద్ర బాణంబున నక్కకుత, కులవ రేణ్యుఁడు ద్రుంచె నాకులు నుతింప. ఆ. కృత్తభోగమైనకృష్ణ సర్పము మాడ్కి, నవనిఁ బడినతచ్ఛితాంబకమును జూచి రాక్ష సేంద్ర సుతుఁడు కాలాగ్నిచం, దానఁ జాలఁ గనలి తక్షణంబ. క. కాలకటాక్ష సమానా, భీలశిలీముఖము లైదు పృథుశౌర్య శ్రీ లోలుఁ డగులక్ష్మణుని పైఁ, గీలలు వడి నిగుడ నేసెఁ గేవలశక్తిన్. చ. జనవరనందనుం డపుడు శాతశరంబులఁ దచ్ఛరంబులం దునిమి కృశాను హేతిసమదుస్సహశాతశరంబు సాయకా సనమునఁ గూర్చి బాహురభనం బలరం దెగ నిండఁ దీసి యా దనుజవ రేణ్యు నెన్నొసలు దాఁకఁగ సేసె మహాద్భుతంబుగన్. 1584 1537 1589 వ. ఇట్లు సన్నతపర్వం బైనయమ్మహానీయసాయకంబుపూ ర్ణాకృష్ట విసృష్టం బై వజ్రా శని వేగంబునం బఱ తెంచి భీమకాయుం డగు రాక్షసునిలలాట దేశంబునాటి తదీ యశోణితాప్లుతం బై మహాపర్వతమన్నం బైనపన్న గంబుచందంబున నందం బై చూడంబడియె నయ్యతికాయుండు లక్ష్మణ బాణ ప్ర పీడితుండై రుద్ర బాణాభి హతం బైన త్రిపురగోపురంబుచాడ్పున నాళంపించి గ్రమ్మఱ స్థైర్యం బవలం బించి తదీయపరాక్రమ ప్రకారంబునకుఁ జింతించి విమర్శించి యాశ్వస్తుండై లక్ష్మణు నవలోకించి రాజనందనా నీవు శత్రుండ వైనను బాణనిపాతనంబున మిక్కిలి శ్లాఘనీయుండ పై తి వని బహూకరించి యాననంబును భుజంబులును సవరించికొని నిశ్చలుండై యెప్పటియట్లు రథోపరిభాగంబున నానీ నుండై మంద రాచలసంకాశం జైనకాంచనరథంబు విచిత్ర గతులం ద్రిప్పుచు మండలీకృతతో దండుండై తండోపతండంబులు గాఁ గాంచనపుంఖ చిత్రిత కాండ ప్రకాండంబులు పరఁగించిన నవి రవిమయూఖంబులభంగి నింగి వెలుంగం జేయుచు నభంగర యంబున నప్పతంగులపుంగవునిదెన నడరిన నసంభ్రాంతుండై యద్దశరథ రాజు