Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/640

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జుట్టుముట్టి యట్టహాసంబుఁ జేసి యేకకాలంబున ననేకశిలావృక్షంబులు పరఁ
గించిన.

1501


శా.

ఆరక్షఃపతినందనుం డపుడు ఘోరాకారుఁ డై శింజినీ
భూరిధ్వానము మింటఁ బర్వ నలుకం బుంఖానుపుంఖంబుగా
నారాచంబులు హేమపుంఖశరము ల్నాళీకబాణంబు లే
పార న్వే నిగిడించి తత్తరునగేంద్రాశ్మంబులం ద్రుంచుచున్.

1502


ఉ.

మీఱి దవానలంబు కడిమి న్నిజహేతులఁ గ్రమ్మి శుష్కకాం
తారము నేర్చినట్లు పటుదారుణశాతశిలీముఖంబుల
న్వారక చుట్టు ముట్టుకొనువానరసైన్యముల న్వధించె న
వ్వీరుఁడు రావణాత్మజుఁడు వేల్పులు నింగిఁ గలంగి చూడఁగన్.

1503


తే.

పట్టపగటింటిసూర్యునిభంగి నుగ్ర
మూర్తి యై యతికాయుఁ డమోఘతీవ్ర
బాణకరముల వానరబలజలాశ
యమును శోషింపఁ జేసె నత్యద్భుతముగ.

1504


తే.

చిత్రగతులఁ జరించుచుఁ జిత్తజల్లు, గురిసినట్లు శరౌఘము ల్పఱపఁ గపుల
భూరిశిరము లన్యోన్యాభిముఖము లగుచు, దట్టమై వ్రాలె వానిరథంబుచుట్టు.

1505


క.

పెక్కండ్ర నొక్కశరమున, నొక్కనిఁ బెక్కంబకముల నురువానరుల
న్జక్కలు వాపుచు రాక్షసుఁ, డక్కజముగ నిట్లు రణవిహారము సలిపెన్.

1506


క.

అక్షీణతేజమున హ, ర్యక్షము మృగగణమునట్టు లద్భుతభంగిన్
రాక్షసనాథతనూజుఁడు, దక్షత భంజించెఁ గపికదంబము నెల్లన్.

1507


క.

అపు డాకపిసైన్యములో, క్షపాచరవరేణ్యసాయకము సోఁకనివా
రపురూప మేమి చెప్పుదు, విపులం బై చెల్లె వానివీర్య మరులకున్.

1508


తే.

అసురవరసాయకార్దితు లై విషణ్ణ, వదను లై సేయునది లేక నుదిలకొనుచు
ఱిచ్చవడి సూచుచుండిరి వృక్షచరులు, దవముముంగలిహరిణపోతములభంగి.

1509


తే.

తఱిమి యెక్కడఁ జూచినఁ దాన యగుచు
మెఱుఁగుచందాన మెఱియుచు శరము లేయు
రాక్షసునిఁ జూచి ప్లవగవారంబు పద్మ
దళవిగ్నతోయముభంగిఁ దల్లడిల్లె.

1510


మ.

నుతదోర్వీర్యు ఖరు న్విరాధునిఁ గబంధు న్వాలి నెవ్వాఁ డనిం
జతురత్వంబునఁ ద్రుంచె నెవ్వఁ డుదధి న్సంక్షోభితుం జేసె ము
న్నతఁ డేఁడీ యిటు చూపుఁ డిప్పు డనిలో నవ్వీరుపైఁ గాని నా
యతులాస్త్రం బడరింప నంచుఁ బటుగర్వాలాపము ల్పల్కుచున్.

1511


క.

ఘోరశరంబులఁ గపుల వి, దారించుచు సరభసముగ దశరథసుతునిం