| |
బరిగి సురేంద్రనందనబాహుపాలితం బైనకిష్కింధాపురంబు నవలోకించి శ
త్రువధార్థంబు లతావితానరంజితనికుంజపుంజంబులమాటునం బొంచి యుండి
రి సుగ్రీవుండు విపులగ్రీవుండై కాననంబున నలుదెసలు పరికించి కేవలం బగు
క్రోధం బంగీకరించి పరివారపరివృతుం డై వాయువేగపురస్సరం బగుమహామే
ఘంబుకరణి నంబరంబు పగుల గర్జించి బాలార్కసదృశుండును దృప్తసింహ
గమనుండునై క్రియాదక్షుం డగురఘుహర్యక్షు నవలోకించి యి ట్లనియె.
| 356
|
| మ. |
జయయంత్రాఢ్యయుఁ గీశవాగురయు భాస్వత్స్వర్ణసాలాభ్యుదా
రయు దేవేంద్రజబాహుపాలితయు నై రాణించు కిష్కింధకు
న్నయ మారం జనుదెంచి తీవు ప్రతిన న్సాఫల్య మొందింప వే
దయతో నాగత మైనకాలము మహాత్మా నూత్నవల్లింబలెన్.
| 357
|
రాముఁడు సుగ్రీవునితో వాలిని యుద్ధమునకుఁ బిలువు మనుట
| వ. |
అనిన విని శత్రుసూదనుం డగు రాముండు సుగ్రీవు నవలోకించి
యిట్లనియె.
| 358
|
| సీ. |
ఈగజపుష్పిచే నిటు కృతాభిజ్ఞానచిహ్నుండ వైతివి చింతయేల
పగతునిదెసఁ బుట్టు పగయు భయంబును రణమున బాణమోక్షణముచేతఁ
బాయఁ జేసెద నాకు భ్రాతృరూపకుఁ డైనశత్రునిఁ జూపుము సంభ్రమమునఁ
బలుకులు వేయేల పగతుఁడు నాదృష్టిపథమునఁ బడి వెండి బ్రతికి పోయె
|
|
| తే. |
నేని యవ్వల నాకడ కేగుదెంచి, తివిరి దోషిఁగా నెంచి నిందింపు మపుడు
సప్తసాలంబులును ఘోరసాయకమున, నవనిఁ గూలుట దీనికి సాక్షి గాదె.
| 359
|
| తే. |
హరివరేణ్య నాచేత నేకాంబకమున, విఱిగి యాసప్తసాలము ల్వెస ధరిత్రిఁ
బడుట వీక్షించితివి గదా బలవిరోధి, తనయుఁ డాచందమున నేఁడు ధరణిఁ గూలు.
| 360
|
| తే. |
వృక్షచరనాథ యేను మున్నెన్నఁ డైన, నెట్టియాపదలం దైన నించుకైన
బ్రమసి యైనను బొంకులఁ బలికి యెఱుఁగ, నిపుడు నామాట కనృతత్వ మేల కలుగు.
| 361
|
| క. |
అమరపతి వృష్టిచే స, స్యమునుం బలె మత్ప్రతిజ్ఞ ననఘ ఫలోపే
తముగాఁ జేసెద నిఁక సం, భ్రమమును సంశయము భయము మానుము మదిలోన్.
| 362
|
| క. |
ఏనీనదము విని చెచ్చెర, నానగచరుఁ డనికి వచ్చునట్టి యహీన
ధ్వానం బొనర్చు మిపు డా, హ్వానార్థము భయము దక్కి వానరవర్యా.
| 363
|
| ఉ. |
ఆనినదంబు కర్ణపుట మంటినయంతనె లేచి తప్తజాం
బూనదమాలి వాలి వెసఁ బోరికి వచ్చు నతండు మున్ను నీ
చే నవిధర్షితుండు జయశీలుఁడు బాహుబలాధికుండు తే
జోనిధి సంగరప్రియుఁడు శూరుఁ డరిందమమాని గావునన్.
| 364
|
సుగ్రీవుఁడు వాలి వచ్చుటకై సింహనాదము సేయుట
| తే. |
వినుము సంగరదూరులు విమతజనుల, ధర్షణంబు సహించరు తపనతనయ
మఱి విశేషించి సతులసమక్షమందు నున్నచో బీర మెక్కుడై యుండుఁ గాదె.
| 365
|