ఇ ట్లుద్గ్రీవు లై దశగ్రీవసుగ్రీవభుజాభిగుప్తనిశాటవనాటు లొండొరుల నిరీ
క్షించి లబ్ధలక్ష్యు లై సముద్యతనానావిధాయుధు లై భుజాస్ఫాలనంబుఁ జేసి
నింగి పగుల సింహనాదంబులు గావించి మచ్చరంబున నొండొరులఁ దలపడం
దివురుచుండునప్పుడు బలవంతు లగువానరులు విజయప్రభూతప్రమోదు లై
వీర్యదర్పితు లై కోపరసోద్దీప్తముఖు లై భైరవారావంబులు సేయుచు భీషణ
ప్రకారంబున మహోగ్రం బైనరాక్షససైన్యంబు సొచ్చి శృంగవంతంబు లైన
పర్వతంబులవడువునఁ దన్మధ్యభాగంబున సంచరించుచు గగనంబుని కెగసి సాం
ద్రంబుగా శిలాపాదపవర్షంబులు గురియుచు దారుణభంగి రణంబునకుం దలప
డినఁ దద్రక్షసైన్యంబులు పరశుగదాముసలముద్గరకుంతప్రాసపట్టసకరవాలభిండి
వాలశరజాలంబులు పరఁగించుచుఁ గోలాహలబహులంబుగా వానరసేనం దల
పడిన నయ్యిరువాఁగులకుఁ బూర్వపశ్చిమసముద్రంబులకుంబోలె ఘోరం బగు
సంగ్రామం బయ్యె నంతఁ గపివీరులు చెలరేఁగి రాక్షసబలంబులకుం గవిసి కవచా
భరణశోభితు లైనరథికులమీఁద బహుపాదపశృంగాకీర్ణంబు లైనశైలంబులు
వైచియు గజారోహకులమీఁద శాఖావంతంబు లైనవిశాలసాలంబు లడరించియు
నాశ్వికులమీఁద హస్తిమాత్రపాషాణంబులు రువ్వియు వజ్రసమస్పర్శంబు లై
నముష్టిబంధంబులఁ బదాతుల బొడిచియు నానాప్రకారంబుల విజృంభించిన
నయ్యాతుధానులు పగిలినశిరంబులతోఁ దెగినకంఠంబులతోఁ బొడియైనగా
త్రంబులతో వాంతలోచనంబులతో రోఁజుచుఁ బుడమిం ద్రెళ్లి గతాసు లైరి
యుద్ధమదాన్వితు లైనరాత్రించరులును వీరావేశంబునఁ గపిబలంబులకుగవిసి
శరజాలంబులు పరఁగించుచుఁ దోమరాంకుశంబుల వ్రేయుచు ఖడ్గంబుల నఱుకు
చు గదాముసలముద్గరభిండివాలశూలాదులం గ్రుమ్ముచు విక్రమవిహారంబు సలి
పిన నందు ఛిన్నోత్తమాంగులై విలూనకరచరణజానుకంఠులై నిష్పిష్టసర్వాం
గులై యనేకవానరులు ధరణిం గూలి రి ట్లుభయసైన్యంబులవారు పరస్పరజయ
కాండులై దలపడి యన్యోన్యప్రహారంబుల విదారితశరీరులై శోణితదిగ్ధగాత్రు
లై నినష్టసర్వాయుధులై విశకలితకేతనాతపత్రచామరులై విఖండితమధ్యోరు
లై పెక్కండ్రు పొడవడంగి రప్పు డయ్యాయోధనభూమి యొక్కముహూర్తంబున
కనేకరుధిరప్రవాహసమావృతయై యగణితవికీర్ణపర్వతాకారహరిరాక్షసకళేబ
రసంపూర్ణయై కంఠదఘ్నమేదోమాంసమస్తిష్టపంకయై రాశీభూతసర్వాయుధ
ఖండజాలయై యొప్పె నంతకుఁ బిరుసనక నయ్యిరుగడలవారును రోషప్రవృద్ధస
త్త్వులై క్రమ్మఱ నద్భుతప్రకారమున రణంబునకుం దలపడి పోరాడం దొడంగి
రప్పుడు వానరులు కొండొకసేపు శిలాతరుశైలంబుల రణంబుఁ జేసి యాసన్నమ
హీరుహంబులు సమసిన రాక్షసులం గొని రాక్షసుల వ్రేయుచు రాక్షసులచేతి
యాయుధంబులఁ బెఱికికొని వారలం జంపుచు రథంబుచేత రథంబును
వారణంబుచేత వారణంబును హయంబుచేత హయంబును జావనేయుచు విచి