Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కాకోదరస్వామికైవడి నీతిఘోరవితతసారం బైనవిల్లు దాల్చి
నానాముఖవిరాజితానేకశరపూర్ణమహితతూణీరయుగ్మము బిగించి


తే.

రక్తచందన మలఁది మాల్యములు దాల్చి, రవికరంబుల మేరుపర్వతముఁ బోలెఁ
జారుచామీకరవిచిత్రచటులదివ్య, మండనద్యుతి విభ్రాజమానుఁ డగుచు.

1410


శా.

తూణీబాణశరాసనోగ్రపరిఘాస్తోకాసిభాస్వత్తను
త్రాణోపేతము కూబరాక్షయుగచక్రస్ఫీతరథ్యధ్వజ
శ్రేణీయుక్తము నైనకాంచనమణిశ్రీరాజితాత్యున్నత
ద్రోణోర్వీధరసన్నికాశరథ మారోహించి తేజస్వి యై.

1411


మ.

రథము ల్సామజము ల్హయంబులు భటవ్రాతంబు లుద్యద్గతిం
గుధరంబు న్దగ నాశ్రయించిన మహాక్షోణీజముల్పోలె నా
రథికశ్రేష్ఠునిఁ జుట్టుముట్టుకొని రాఁ బ్రస్ఫీతసాంద్రద్యుతిం
బ్రథనేచ్ఛ న్వడి నేగె దేవయుతజంభద్వేషిచందంబునన్.

1412


తే.

అతనియాటోప మతనిశౌర్యప్రవేగ
మతనితేజంబుఁ జూచి దశాననుండు
వీఁడు పగతులఁ బరిమార్చి విజయ మొసఁగు
నిక్కువం బని తెలివొందె నెమ్మనమున.

1413


చ.

అనిమిషవాజసన్నిభసితాంగమనోజవయుక్తచారుకాం
చనమయభూషణప్రబలసైంధవరాజము నెక్కి ప్రాసి యై
ఘనశిఖి నెక్కి శక్తిఁ గొని గ్రాలు కుమారునిభంగి నొప్పుచు
స్ధానభుజుఁ డానరాంతకుఁడు గ్రక్కున నేగె రణాభికాంక్షి యై.

1414


ఆ.

అతనివెనుకఁ జనియె నరదంబు లశ్వంబు, లున్నతద్విపంబు లురుపదాతి
గణము లుగ్రభంగి గణుతింపఁగా రాక, ధరణిరజము మింటఁ దఱుచు నిగుడ.

1415


మ.

ధరణీభృత్సమసారదారుణమహాదంభోళితుల్యస్ఫుర
త్పరిఘం బొక్కటి కేలఁ బూని మును మంథానాద్రి నుద్యద్గతిం
బరమోదారత నెత్తినట్టిహరిరూపంబు న్విడంబించుచున్
స్థిరసత్త్వం బలరార నేగె నపు డాదేవాంతకుం డాజికిన్.

1416


తే.

అమ్మహావీరశేఖరు ననుసరించి
కరిఘటలు తేరు లశ్వసంఘములు భటక
దంబము లనేకములు సముదగ్రభంగిఁ
జనియె నప్పుడు కలకలధ్వనులు సెలఁగ.

1417


మ.

ముద మొప్పం జెదలన్ మిడుఁగుఱులగుంపు ల్దట్ట మై పర్వఁగా
గద సారించుచుఁ బర్వతంబుకరణిం గాయంబు శోభిల్ల ను
న్మదుఁ డై సైన్యసమేతుఁ డై ధనదుచందాన న్రహిం గ్రాలుచుం