Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విగతనాయకులునై భయంబున ఘోషించుచుం బఱచి భిన్నచిత్తులై రాముని
శరణంబు నొంది రప్పుడు భయార్దితు లై పఱచుకపుల నిరీక్షించి వాలిపుత్రుం
డైనయంగదుండు వేగ౦బున నొక్కగిరిశిఖరంబు కరంబునం బూని సారెకు
మహావాదంబు సేయుచుఁ గుంభకర్ణపదానుగు లైనరాక్షసులకు భయంబుఁ
బుట్టించుచు నతిరభసంబుగాఁ బఱతెంచి.

1336

అంగదుఁడు కుంభకర్ణునితో యుద్ధము చేసి మూర్ఛిల్లుట

సీ.

కడురయంబునఁ గుంభకర్ణునిశిరముపై బృథుమహీధరశృంగ మెత్తి వైవ
నద్దానవుండు మహాకోపమున నుండి చరణఘట్టనమునఁ బుడమి యదర
నాకంబు పగుల మహాధ్వని సేయుచు వాఁడిమగం డైనవాలిసుతుని
డాయఁగ వచ్చి కాలాయసమయ మైనచటులశూలంబు రోషమున వైవ


తే.

దాని వీక్షించి జన్యవిద్యావిదుండు, ప్లవగకులశేఖరుం డతిలాఘవమున
వ్రేటు దప్పించుకొని భుజవిక్రమంబు, గ్రాలఁ గడురభసంబునఁ గదియవచ్చి.

1337


చ.

పటుశతకోటితుల్య మగుపాణితలంబునఁ గుంభకర్ణునిం
దటుకున వ్రేసె వ్రేయుటయుఁ దద్దయు దొమ్మరవోయి యంతలో
దిటమునఁ గొంతసేపునకుఁ దేఱి రయంబున ముష్టిచే మదో
త్కటముగ వాలిజుం బొడువఁ దప్పక మూర్ఛితుఁ డయ్యె నాతఁడున్.

1338


ఉ.

ఈగతి నంగదుం గినుక నెంతయు మూర్ఛితుఁ జేసి భూరిదో
ర్వేగ మెలర్ప రాత్రిచరవీరుఁడు శూలము దాల్చి కన్నుల
న్రాగ మెలర్ప వేగ రవినందనుమీఁదికి నాగ్రహంబుతో
నేగెఁ బదాభిఘాతమునఁ బృథ్వి చలింపఁ జలంబు మీఱఁగన్.

1339


శా.

ఈరీతిం జనుదెంచురాత్రిచరుని న్వీక్షించి సంరంభి యై
వీరుం డాప్లవగాధిపుండు పటుద్వోర్వీర్యంబు దీపింపఁగా
ధీరత్వంబున శైలము న్గొని వియద్వీథి న్వడిం ద్రిప్పుచు
న్ఘోరప్రక్రియ వానిమీఁది కుఱికెం గ్రోధంబు రెట్టింపఁగన్.

1340


చ.

ఇటు చనుదెంచు చున్నప్లవగేంద్రునిఁ గన్గొని కుంభకర్ణుఁ డు
త్కటపటురోషవేగమునఁ గన్నుల నగ్నికణంబు లొల్కఁగాఁ
గుటిలమనస్కుఁ డై వికృతఘోరశరీరము మిన్ను ముట్ట మ
ర్కటకులభర్త క ట్లభిముఖంబుగ నిల్చె మహాద్భుతంబుగన్.

1341


క.

కపిశోణితదిగ్ధాంగునిఁ, గపుల న్వడి మ్రింగువాని ఘటకర్ణునిఁ గ్రో
ధపరీతచిత్తుఁ గనుఁగొని, కపివిభుఁ డిట్లనుచుఁ బలికె గర్వం బెసఁగన్.

1342

సుగ్రీవుఁడు కుంభకర్ణునితోఁ బోరి మూర్ఛిల్లుట

చ.

కడువడి దుష్కరం బయినకార్య మొనర్చి తనేకవీరులం
గెడఫితి వాజి దుర్జయులఁ గీశుల మ్రింగితి వింతె చాలు నీ