| |
ననిలనందనుని భుజాంతరంబున వ్రేసె వ్రేసిన నమ్మహావీరవరుఁడు
విహ్వలుఁడై నోట వెడవెడ రక్తంబు గ్రక్కుచుఁ గాలాంతఘనముమాడ్కి
|
|
| తే. |
ఘోరనాదం బొనర్చె నవ్వీరుఁ డిట్లు, వ్యధితుఁ డగుట విలోకించి యసురు లపుడు
హర్షనాదం బొనర్చిరి హరిబలంబు, వేగ దైత్యేంద్రుకడిమికి వెఱచి పఱచె.
| 1335
|
నీలఋషభశరభగవాక్షగంధమాదనులు కుంభకర్ణునిచే మూర్ఛిల్లుట
| వ. |
అప్పుడు వానరచమూపాలుం డగునీలుండు బలంబులఁ జిక్కుపడకుండ మోహ
రించి యొక్కమహోగ్రశైలశిఖరంబు కుంభకర్ణునిమీఁద వైచిన నయ్యసురవల్ల
భుండు శక్రాశనిసమస్పర్శం బైనపిడికిట నయ్యచలశృంగంబు నడిచిన నది పొడి
యె మిడుంగుఱులు సెదరఁ జెదల మంట లెగయ మహీతలంబునం బడియె
నంత నీలునకు బాసట యై ఋషభుండును శరభుండును గవాక్షుండును గంధ
మాదనుండునుం గూడుకొని రి ట్లేవురు వానరశార్దూలురు పంచాగ్నులుంబో
లెఁ దేజరిల్లుచుఁ గుంభకర్ణు నాక్రమించి సర్వప్రాణంబుల శిలావృక్షముష్టిపాద
తలంబుల ననేకప్రకారంబుఁ బ్రహరించిన నద్దనుజశేఖరుండు తత్ప్రహారంబులం
జింతింపక మదోన్మత్తుం డై మహావేగుం డైనఋషభుని బాహువులం గ్రుచ్చి పట్టి
మెదిచిన నవ్వానరశ్రేష్ఠుండు తదీయభుజాంతరపీడితుండై ప్రముఖాగతశోణితుం
డై ధరణిపయిం బడియెఁ దదీయముష్టిహతుం డై శరభుండు మూర్ఛితుం డయ్యె
జానుఘాతంబున నీలుండు పుడమిం ద్రెళ్లెఁ చలప్రహారంబున గవాక్షుండు విసం
జ్ఞుం డయ్యె ని ట్లవ్వానరవీరులు తత్తత్ప్రహారవ్యధితులై శ్రోణితంబు గ్రక్కుచు
నికృత్తంబు లగుకింశుకంబులభంగి మేదినిం బడి రిట్లు వానరముఖ్యుల మూర్ఛి
తులం జేసి వానరబలంబున కుఱికి బహుప్రకారంబుల మథింపందొడంగిన నవ్వ
నచరు లందఱు మృగయూథంబులు మహామహీధరంబు నారోహించినకరణి
నక్కుంభకర్ణునిమీదికిం బ్రాఁకి నఖంబులఁ జించుచు దంతంబులఁ గఱచుచుఁ
దలంబుల వ్రేయుచు ముష్టిఘాతంబులం బొడుచుచు జానుకూర్పరంబుల మర్దిం
చుచు ననేకప్రకారంబుల నొప్పించిన మహాపర్వతోపముం డగుకుంభకర్ణుండు
వానరసహస్రసమాచితుండై యాత్మరుహంబులచేతఁ బర్వతంబుకరణి శోభిల్లు
చు సంక్రుద్ధుం డై తార్క్ష్యుండు పన్నగంబులంబోలె వానరసహస్రంబులం బట్టి
మ్రింగం దొడంగిన నబ్బలీముఖులు పాతాళసన్నిభం బైనవక్త్రంబునందుఁ
గుంభకర్ణునిచేతఁ బ్రక్షిపులై గ్రమ్మఱ నాసారంధ్రంబులవలనను గర్ణబిలంబుల
వలనను నిర్గమించుచుండి రిట్టు పర్వతసన్నిభు లైనవానరుల భక్షించుచు బహు
ప్రకారంబుల భంజించుచు రణమేదిని మాంసశోణితసంపూర్ణ గావించుచు హరి
సైన్యమధ్యంబునఁ గాలాగ్నిచందంబునఁ గ్రోధమూర్ఛితుండై కాలాయసమ
యం బగుశూలంబు కేలం గ్రాల భయంకరాకారుండై విహరించుచు నిదాఘ
కాలంబునఁ బావకుండు శుష్కారణ్యంబు దహించువడువున వానరవాహినీ
సందోహంబుల దహించిన నవ్వనచరులు హతయోధులును వధ్యమానులును
|
|