డ ము. 589 1326 చ. అనిమిషవై రిపైఁ దొడరి యాల మొనర్తము వీని నాజిలోఁ దునిమితి మేనియు న్మనకు దొడ్డయశం బొడఁగూడు వీఁ డని న్మనల వధించె నేనియు రమాపతిలోకము గల్గు నూరు లెం చినఘననీతిమార్గము భజింపుఁడు వీడుఁడు సాధ్వనం బొగన్. ఆ. ప్రాణభీతి నొంది భండనంబున నోడి, పాణి కౌరవమునఁ బడుటకంటెఁ బరులచేతఁ జచ్చి బ్రహ్మలోకి సుఖంబుఁ, బడియు టొప్పుఁ గాదె ప్లవగులార. చ. తడయక మంటలోఁ బదుపతంగముకె వడి నీనిశాచడం డుడుగక మత్తుఁ డై రఘుకులో తమదారుణ దృక్పథంబునం బడి తదమోఘ బాణములఁ బంచత నొందెడు మీూర లింతలోని బదపడి వీనికి న్వెఱచి పాఱఁగ నేల నిలుండు ధీరతన్. 1828 -*చంది. వానరవీరు లందఱు నొక్క మొత్తమై కుంభకర్ణునితో యుద్ధము సేయుట. ధరమం వ. మఱియు బలవంతుల మైన మైన మనేకుల మొక్క రాక్షసున కోడి ప్రాణ భ బునం బఱిచిన సంత భీరులని శూరులు నిందింతుకు దానం జేసి మనయశంబు నకు హాని వచ్చు నని పలికిన నయ్యంగదునివచనంబులు విని యక్కపులు నీ వేమి చెప్పిన నిక్కుంభ కర్ణునిమునుమున నిలువం జాల మేడ కేనియుం జని ప్రాణం బులు రక్షించుకొనియెదము ప్రాణంబుల కంటెఁ బ్రియవస్తు వెద్దియు లేదు గదా యని శూరవిగ ర్హితంబుగాఁ బలుకుచు నిలువం బడక కుంభకర్ణభయభ్రాంతు లైపఱచుచున్న నయ్యంగదుండు వారల కడ్డంబు చని నిలువరించి సాంత్వవా క్యంబుల సప్తసాలగిరి భేదనాదిదృష్టాంతంబుల వెఱపుదీర్చి బరవసంబుఁ జేసి పురి కొల్పి గ్రమ్మఱించిన నయ్యూథపు లంగదవాక్యబోధితు లై యతనిశాసనంబు నుల్లంఘింపం జాలక యెట్టకేలకుఁ గొండొక ధైర్యంబుఁ బూని సంగ్రామార్థు లై గ్రమ్మఱఁ గుంభకర్ణున కభిముఖంబుగా నడిచి రప్పుడు వాయునందనుండు ఋ షభ శరభ మైందనలనీలకుముదను షేణగ వాక్షరంభ తారద్వివినమనసులం గూడి యద్ద శాన నానుజునిమీఁద నడిరెనిట్లు వానరయూథముఖ్యులందుఁ జేయంగల మేటిమగ లందజొక్క మొత్తంబై కథితాత్మీయ ప్రాక్పరాక్రములై సమారోపిత విక్రములై మరణం బొ౦డె యశంబోండె నని కృతనిశ్చయులై భయంబు వదలి వీరావేశంబున ధారాధరంబులు ధరాధరంబునుం బొదివిన కరణిఁ గుంభకర్ణునిం దదనుచరులం బొదివి సానుమంతంబు లగుపర్వతంబులును సమూలంబు లగు పాదపంబులునుబరఁగించితుములంబుగా యుద్ధంబు గావించిననక్కుంభకర్ణుండు మేనుఁ బెంచి విజృంభించి వీర్యం బంగీకరించి సంక్రుద్ధుం డై ప్రచండం బైన గదాచండంబు జిఱజిఱంద్రిప్పుచు నుభయపక్షంబులు నాక్రమించి యొక్కొక వేటునకుఁ బదివేల నిరువది వేల వానరులం బుడమిఁ గూల్చుచు నొక్కొక్క మాటు వైనతేయుండు పన్న గంబులంబోలె నూర్వుర నిన్నూర్వురం బట్టి మ్రింగుచు బలుమానిసి చీములం జమురిన తెఱంగునఁ గాలం గేలఁ జమరుచు
పుట:గోపీనాథరామాయణము2.pdf/612
స్వరూపం