| |
వ్వనిచే నే మగు నాతనిఁ, గొని యేమి యొనర్చువాఁడ గ్రూరత్వమునన్.
| 1169
|
| క. |
అని పలికి వారివలన, న్వినఁదగు ప్రత్యుత్తరంబు వినఁబడ కునికి
న్మనమున ఖేదించుచు న, ద్దనుజాధిపుఁ డనియె మరల దైత్యులతోడన్.
| 1170
|
| తే. |
ఇట్టివ్యసనంబు దొరకొనినట్టిచోట, వాఁడి మెఱసి రణంబునఁ దోడుపడని
విబుధనాథ ప్రతీకాశవీర్యుఁ డైన, కుంభకర్ణుఁ డిఁ కెన్నఁడు గూడి వచ్చు.
| 1171
|
| వ. |
అని పలికినరావణునివచనంబు విని మాంసశోణితభోజను లగుయాతుధానులు
కొందఱు పరమసంభ్రాంతులై యతనిపనుపున గంధమాల్యంబులును భక్ష్యం
బులును గొని రయంబునఁ గుంభకర్ణునివేశనంబుకడకుం జని యొక్కచోట మహా
ద్వారకవాట యై సమంతతోయోజనాయత యై రమ్య యై శోభన యై కాం
చననిబద్ధభూమి యై సర్వగంధప్రవాహిని యై యొప్పునొక్కగుహ నవలోకించి
యతిప్రయత్నంబునం బ్రవేశించి యందు భీమనాసాపుటుండై పాతాళవిపులా
ననుం డై శయ్యావిన్యస్తసర్వాంగుం డై మేదోరుధిరగంధి యై కాంచనాంగ
దనద్ధాంగుం డై హారకిరీటశోభితుం డై భీమదర్శనుం డై యూర్ధ్వరోమాంచి
తశరీరుం డై వికృతరూపుం డై మహాశ్వాసవిత్రాసితసర్వభూతుం డై కుబుసంబు
గప్పినమహాపన్నగంబుకరణి వికీర్ణం బైనపర్వతంబుమాడ్కిఁ జూడ్కికి వ్రేఁ
గగుచు శయనించి కాలవ్యాళంబు పగిది బుసకొట్టుచు గాఢంబుగా నిద్రించు
చున్నమహాబలుండును నైరృతవ్యాఘ్రుండు నరిందముండు నగుకుంభకర్ణు
నవలోకించి రాక్షసు లందఱుఁ దదీయనిశ్శ్వాసవాతావధూతు లై నాసావివ
రంబులలోనికిం బోవుచుఁ గ్రమ్మఱ నిర్గమించుచుఁ గారాకులగతి సుడివడి మహా
బలులు గావునఁ గొండొకసేపునకు నతిప్రయాసంబున నూల్కొని యతలకడ
కుం జని తదీయాగ్రభాగంబునఁ బరమతర్పణం బైనమాంసంబును మృగమహి
షవరాహమాంససంచయంబును బరమోదనంబును మహాద్భుతంబుగా మేరు
మహీధరంబుపొడువున రాశి పడవైచి శోణితకుంభంబులును వివిధమద్యభాండం
బులును నించి పరార్థ్యకాలాగరుచందనం బలంది దివ్యసుగంధిగంధమాల్యం
బుల నలంకరించి సుగంధిధూపంబు లర్పించి తద్విబోధార్థంబు కొందఱు జల
దంబులభంగి గర్జించిరి కొందఱు శశాంకసదృశప్రభంబు లగుశంఖంబులు
పూరించిరి కొందఱు సింహనాదంబులు చేసిరి కొందఱు భుజాస్ఫాలనంబు గావిం
చిరి కొందఱు భేరీమృదంగపటహంబులు వాయించి రి ట్లంద ఱేకకాలంబున
మహానాదంబులు గావించినఁ దదీయనానావిధనిర్ఘోషంబు దశదిశలు నిండి
త్రిదివంబు నాక్రమించి భీషణభంగిం జెలంగిన నయ్యఖండనిస్వనంబున కవిసి
గతప్రాణంబు లై విహంగమంబులు మింట నుండి పుడమిం బడియెఁ గుంభ
కర్ణుం డంతకు మేల్కొన కున్నం జూచి.
| 1172
|
రాక్షసులు కుంభకర్ణుఁడు మేలుకొనుటకు నానావిధప్రయత్నములఁ జేయుట
| చ. |
అసురగణంబు లుగ్రపరిఘాశనిపట్టిసశూలఖడ్గము
|
|