| క. |
వేమఱు నాచే బాధితు, లై మునులు తపోబలమున నాడినవచనం
బామెయి నేటికి జతనం, బై మొనసి మహర్షివాక్య మనృతం బగునే.
| 1163
|
| వ. |
మఱియుఁ దొల్లి కైలాసగిరిచలనసమయంబున రావణునకు స్త్రీనిమిత్తంబుగా
మరణంబు గల్గు నని పార్వతీదేవి శపియించె నదియునుం గాక రాక్షసాధమా
వానరమూర్తి నగున న్నవలోకించి మత్ప్రభావం బెఱుంగక మౌర్యంబునఁ
బరిహసించి న న్నవమానించితివి గావున మద్రూపసంయుక్తులును మద్వీర్యసమ
తేజులు నగువానరులు భవద్వినాశార్థంబు జనించెద రని నందీశ్వరుం డాడె
మఱియు నెప్పుడేని కామార్తుం డై యకామ యగు యువతిని బలాత్కారం
బున ధర్షించునప్పు డతనిశీర్షంబు సప్తప్రకారంబుల వయ్య లగు నని న న్నుద్దే
శించి రంభానిబంధనుం డైననలకూబరుండు పలికె రావణుండు శ్రీధర్షణని
మిత్తంబున వధంబు నొందునని వరుణకన్యకానిబంధనుండై విరించి తిట్టె నవి
యన్నియు నమోఘంబు లై నాచేత సంప్రాప్తంబు లయ్యె. దచ్చాపనిమి
త్తంబు లెఱింగి బలవంతు లగురాక్షనులు చర్యాగృహగోపురద్వారప్రాకారం
బు లారోహించి మహాయత్నంబున లంకాపురంబు రక్షింతురుగాక యని పలికి
తనపరాజయంబును బ్రహస్తునిమరణంబును విచారించి కుంభకర్ణుని భీమబలునిఁ
గా నెఱింగి తన్నిబోధనంబు నుద్దేశించి రాక్షసుల నవలోకించి యి ట్లనియె.
| 1164
|
రావణుఁడు కుంభకర్ణుని మేలుకొలుప రాక్షసుల కాజ్ఞాపించుట
| సీ. |
దనుజశేఖరులార మనకుంభకర్ణుండు మంత్రంబు గావించి మనము జన్య
మారంభ మొనరించునంతకు మును తొమ్మిదవనాఁటనుండి పద్మజునిశాప
పరవశుఁ డై మేను మఱచి గాఢంబుగా నిద్రించి యున్నాఁడు నెఱయ నాఱు
నెలలు నిద్రించి యవ్వల నొక్కనాఁడు మేల్కనువాఁడు గావున నని యెఱుంగఁ
|
|
| తే. |
డతఁడు దేవదానవదర్పహంత శూరుఁ, డతిబలుం డతిధీరుఁ డప్రతిమరూపుఁ
డమితగంభీరుఁ డరికాలుఁ డతని మేలు, కొలుపుఁ డిప్పుడు కార్యంబు గూడవచ్చె.
| 1165
|
| చ. |
అతఁ డపరాజితుండు నిఖిలాసురముఖ్యుల కెల్ల మేటి య
ప్రతిమభుజాబలుండును సుపర్వుల కెల్లను జిత్తశల్య మా
యతభుజుఁ డాజిరంగమున నద్రిచరేంద్రుల రాజపుత్రులన్
క్షితి నవలీలఁ గూల్చి జయశీలుఁడు నాకు జయం బొసంగెడిన్.
| 1166
|
| తే. |
సకలరాక్షసముఖ్యుండు సంగరమునఁ
గేతుభూతుండు లోకవిఖ్యాతసత్త్వుఁ
డతఁడు మూఢుఁ డై గ్రామసౌఖ్యంబు మరిగి
మంచి చెడు గాన కెపుడు నిద్రించి యుండు.
| 1167
|
| తే. |
ఆఘనుండు ప్రబోధితుం డయ్యెనేని, దారుణం బైనసంగ్రామతలమునందు
మానవేంద్రశరార్తుండ నైననాకు, శోక మించుక గలుగదు శూరుఁ డగుట.
| 1168
|
| క. |
అనిమిషపతినిభబలుఁ డగు, జనపతిచే నిట్టివగపు సమకొని రా నె
|
|