| |
న్బలవదరాతిమర్ధని క్షపాచరవానరసాధ్వసప్రదం
జలమునఁ గేలఁ బూని రఘుసత్తముపై వెస వైచె నుద్ధతిన్.
| 1125
|
| వ. |
ఇట్లు రావణప్రయుక్త యై వజ్రాశనివేగంబునం బఱతెంచుచున్నశక్తి నవలో
కించి భరతానుజుండు హుతాగ్నికల్పంబు లగునానాస్త్రబాణంబులు పఱఁ
గించిన.
| 1126
|
మూర్ఛితుఁ డగులక్ష్మణుని రావణుఁ డట్టిట్టు కదల్పలేకపోవుట
| చ. |
అనుపమఘోరబాణముల నన్నిటి మ్రింగుచు వచ్చి శక్తి పె
ల్చన రఘువీరముఖ్యునివిశాలభుజాంతరసీమఁ జొచ్చెఁ జొ
చ్చిన వెస శక్తిమంతుఁ డగు శ్రీపతిసన్నిభుఁ డామహాత్ముఁ డొ
య్యనఁ బెనుమూర్ఛ పైకొనిన నద్భుతభంగిఁ బడె న్రణంబునన్.
| 1127
|
| వ. |
ఇట్లు బ్రహ్మదత్తశక్తితాడితుం డై భరతానుజుం డగులక్ష్మణుండు తద్విపత్పరి
హారార్థంబు తన్ను స్వమూలకారణుండును భగవంతుండును సర్వవ్యాపారం
డైననారాయణునియచింత్యం బైనభాగంబునుం గాఁ దలంచుచు మూర్ఛితుం
డైననమ్మహాత్ముని డాయం జనుదెంచి లంకకు గొనిపోయెదఁ గాక యని దలంచి
మహాబలుం డగురావణుండు బాహువులు సాంచి బలంబుకొలంది కొంతదడవు
పీడించి.
| 1128
|
| చ. |
మును పురవైరియుక్తముగ భూరిబలంబున వెండికొండ నె
త్తిన ఘనుఁ డాదశాస్యుఁ డతిధీరుని లక్ష్మణు నెత్తఁజాలఁ డ
య్యె నిఖిలవిష్టపంబుల రహిం దనలో నిడిగొన్న దైత్యమ
ర్దనునివరాంశభూతుఁ డగుదాశరథిం గదలింప శక్యమే.
| 1129
|
| వ. |
మఱియు సమస్తధీరోపమానభూతుం డైనహిమవంతుండును సమస్తరత్నాక
రప్రధానగంభీరతరక్షీరోదక్షోభణక్షమం బైనమందరంబును జతుర్దశభువనంబు
లకాధారభూతం బైనహేమాచలంబును సప్తసాగరకులాచలసహితం బైన
భూమండలంబును జరాచరానంతకోటిభూతనికరాశ్రయం బైనత్రైలోక్యంబు
ను భుజబలంబునఁ జలింపంజేయుటకు సమర్థుఁ డగురావణుండు లక్ష్మణు నిట్ట
ట్టు గదల్పంజాలక వెగటువడి.
| 1130
|
హనుమంతుఁడు ముష్టిచే రావణునిఁ బొడిచి మూర్ఛిలఁ జేయుట
| తే. |
ఉరగపతిమాడ్కి రోఁజుచు నోపినట్లు
విడువక పెనంగురాక్షసవిభునిఁ జూచి
రుష్టుఁ డై వాయుజుఁడు వానిఱొమ్ముఁ బొడిచె
కులిశనిభ మైనపిడికిట గుండె లవియ.
| 1131
|
| క. |
ఈరీతి వాయునందన, దారుణపవితుల్యముష్టితాడితుఁ డై దే
వారి ముఖనయనకర్ణ, ద్వారంబుల శోణితంబు తరుచుగ నిగుడన్.
| 1132
|