యు డము. మహోత్తాల తాలంబు లంసభాగంబుల నలవరించుకొని పాదవిన్యాసంబులఁ బుడమి గ్రక్కగలఁ దలపడి యడగునంతలోనఁ గాలాయసమయంబు లగు మునలంబు లు త్తమాంగంబుల పయిం బడిన నిష్పష్ట శరీరు లై శిరంబులు పగిలి గిరిశిఖరంబులవలనం దొరఁగు సెలయేళ్లకరణి సాంద్రంబుగా రక్తధారలు స్రవింపఁ బుడమింబడి కెడయు మర్కటులును మదపుటే నుంగులడీ కొలిపి తోచు రాంకుశ ప్రహారంబులు నెదిరి వారిం బ్రహరింప నుంకించునంతలోన విశాలసాల తాల ప్రహతులు విభిన్న వర్ష లై రుధిరంబులు గ్రక్కుచు వివృతవదను లై పుడ మిం డ్రెళ్లి జీవితంబులు విడుచుగజూరోహకు ఆగుదానవులును మహేంద్ర ధ్వజసంకాశంబు లై నదీర్ఘాంచిత లాంగూలంబు లెత్తికొని భీషణరభ సాతిరేకం బున వడి నడుచునంతలోన పర్ధచంద్రసాయకంబులఁ గంఠనాళంబులు దెగిన నదియె వేగంబున నొక్కింతదూరం బరిగి గతాసు లై నేలం గూలువళీ ముఖులును హయంబులు దుమికించుచు నిశాతంబు లగు కౌక్షేయకంబు లెత్తి కొని యొరులం దెగవేయ గమకించునంతలోన దృఢం బగువాలపాశంబుల నురిపెట్టి పుడమికిం బడ నీడ్చిన నూపిరి వెడలక తన్నుకొని చచ్చు నాశ్వికు చచ్చునాశ్వికు లగుయాతుధానులును నిశాత నఖంబుల వచ్చి వధింప వీరావేశంబునం జను దెంచునంతలోన నిశాతాగ్రంబు లగుకుంతంబులం బొడిచిన గతజీవు లై కుఠారధారానికృత్తంబు లగుతరువుల పోలికి రోఁజుచుఁ బుడమిం డ్రైళ్లుకవులును దీక్షా గ్రంబు లగుళూలంబు లెత్తుకొని మహాశని వేగంబున యునంతలోన వజ్రశనిసమస్పర్శంబు లగువీడికిటిపోటులం గ్రుమ్మిన భగ్న సర్వావయవులై గూ లునిశాచరులును నొగలు పట్టుకొని రథికసారథిరథ్యసహితంబుగా భుజాబలంబు కొలంది విసరి వైచిన విభిన్న సర్వాంగంబులై పడురథంబులును మహేంద్ర ధ్వజ సన్నిభంబు లగుతుండంబులు పట్టుకొని జిఱజిఱం ద్రిప్పి నేలకు వేసినఁ జదు రుపలై ధరం దొరఁగుమత్తేభంబులును నఖదంత ప్రహతుల శరీరంబులు వచ్చి నన నేకముఖంబుల శోణితంబు లొలుకఁ జిందఆవందఱలై మడయుతురంగం బులునుం గలిగి యయ్యాయోధనం బత్యద్భుత దర్శనం బయ్యెం బ్రహస్తునిసచి వులు నరాంతకుండును గుంభహనుండును మహానాదుండును సమున్నతుండును దలమిగిలివాన రబలంబులకుం గవిసి యనేకశస్త్రాస్త్ర పరంపరలు పరఁగించి పేక్కండ నక్క జంబుగా నుక్కణంగించుచుఁ బెక్కు తెఱంగుల రణ క్రీడ గావించిన నది విలోకించి యలుక నొడమించి త్తంబున వియత్తలం బు తలపడ సింహనాదం బులు సేయుచు మహారంహంబున వానరసింహు గుద్వివిదుండును దారుం డును జాంబవంతుండును దుర్ముఖుండును గ్రమంబున వారలం దలపడి విచిత్ర ప్రకారంబున శిలాపాదపంబులఁ గొండొకసేపు. ఘోరంబుగాఁ బోరు గావించి రంత. 149 1085
పుట:గోపీనాథరామాయణము2.pdf/568
స్వరూపం