Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.⁠

దనుజేంద్ర యింతకుమును నీతివిదు లైనమంత్రులఁ గూర్చి సమంచితముగ
నాలోచన మొనర్చి యరులబలాబలం బటు విమర్శించి భావ్యర్థ మెల్ల
రహి నిశ్చయించి సంగ్రామంబునకుఁ బోవ సమకట్టి యున్నాఁడ సంభ్రమమున
జానకి నిత్తునా సమరం బొనర్తునా యని మున్ను నీవు న న్నడిగినపుడు

⁠


తే.⁠

మనుజునకు నోడి సతి నిచ్చు టనుచితంబు
పోరు గావింత మని నీకు బోధఁ జేసి
కార్యమున కెత్తి వచ్చినఁ గడిమి మెఱసి
వైరుల వధింతుఁ గా కేల యూరకుందు.

⁠ 1008


తే.⁠

ఏను నీచేత సతతంబు దానమాన, వివిధసాంత్వవాక్యంబుల వేయిగతుల
నర్చితుండ నై తఱి వచ్చినపుడు నీకుఁ, బ్రియము గావింప కేటికి రిత్తవుత్తు.

⁠ 1009


చ.⁠

తనయకళత్రమిత్రధనధాన్యము లెక్కుడు గాదు నాకు నీ
పనుపున నేగి ఘోరరణపండితు రాముని వానితమ్ముని
న్వనచరసైన్యయుక్తముగ వ్రచ్చి వధించెద నీకుఁ బ్రీతిగా
దనుజవరేణ్య ప్రాణములు దాఁపుదునే యిఁక వేయి యేటికిన్.

⁠ 1010


వ.⁠

అని పలికి సంరంభవిజృంభితుం డై సమస్తరాక్షసప్రశస్తుండును క్షిప్రహస్తుం
డు నగుప్రహస్తుండు సముచితంబుగా రావణునిచేత ననుజ్ఞాతుండై తనముంగల
నున్నదండనాయకుల నవలోకించి యిప్పుడు మదీయదివ్యబాణాశనివేగంబున
రణంబులోన నరవానరుల వధించి తదీయరక్తమాంసాహారంబుల మాంసాదం
బు లగుమృగపక్షిగణంబుల కాఁకలి దీర్చెద మీరు శీఘ్రంబున బలంబుల
సంగ్రామంబునకు సన్నద్ధంబులఁ గావింపుఁ డని పలికిన వారు తద్వచనప్రకారం
బునఁ గృతత్వరు లై తన్మందిరాంగణంబునందుఁ జతురంగబలంబుల నసంఖ్యా
తంబుగాఁ గూర్చిన నమ్మహాచమూకదంబంబు తిగ్మనానావిధాయుధం బై యనం
తహేతిచ్ఛటాపరిస్ఫీతం బైనదవాగ్నిచందంబునం గ్రాలుచుండె లంకాపురంబు
శతాంగమాతంగతురంగభటపుంగవసంకులంబై మత్తమాతంగసంకులం బైన
జలాశయంబుకరణి శోభిల్లె నప్పుడు రాక్షసు లందఱు హవిరాజ్యహోమంబుల
చేత హుతాశనునిఁ దృప్తి నొందించి బ్రాహ్మణులకు సమస్కరించి పుష్పగం
ధాంబరభూషణంబులం గైసేసి సంగ్రామసజ్జంబు లైన బాణబాణాసనతూణీరత
నుత్రాణశిరస్త్రాణగోధాంగుళిత్రాణంబులు ధరించి ప్రీతిసంహృష్టసర్వాంగులై ద
శగ్రీవునిశాసనంబునఁ బ్రహస్తునిం బరివేష్టించి రప్పు డాహవిరాజ్యగంధప్రతివ
హుండై పరిమళించుచు గంధవహుండు విసరె నంత వాహినీవల్లభుం డగుప్రహస్తుం
డు చతుర్విధాలంకారభూషితుండై వైశ్వానరసమప్రభం బైనకవచంబు దొడిగి
తూణీరంబు బిగించి శక్రధనుస్సంకాశం బైనకార్ముకంబు ధరించి సకలసాం
గ్రామికపరికరసమేతుం డై సమరభేరి వ్రేయించి మహాజవహయసంయుక్తంబును
సమ్యక్సూతసుసంయుతంబును మహాజలదనిర్ఘోషంబును సాక్షాచ్చంద్రార్క

⁠