| |
భావుం డగురాముండును మహాబలుం డగులక్ష్మణుండును సుగ్రీవప్రముఖవానర
శ్రేష్ఠులును విభీషణుండును బ్రీతిసంహృష్టసర్వాంగు లై మారుతిం గొనియాడి
రంత హతశేషు లగురాక్షసులు లంకకుం జని యకంపనవధప్రకారంబు సర్వం
బును విస్పష్టంబుగా నెఱింగించిన విని రాక్షసేశ్వరుం డగురావణుండు కించిద్దీన
వదనుం డై యొక్కముహూర్తంబు విచారగ్రస్తమానసుం డై యుండి యొ
క్కింత ధైర్యం బవలంబించి మంత్రుల నందఱ నవలోకించి వారితోడ విచా
రించి నిశ్చయించి తత్పూర్వాహంబున సర్వగుల్మంబుల నవలోకింపంజని రాక్షస
గణసంగుప్త యై బహుగుల్మసమావృత యై పతాకాధ్వజమాలిని యై యున్న
లంకాపురి సర్వంబు నవలోకించి వానరగణసంరుద్ధయై యుండుట కమర్షితుం
డై తత్కాలసన్నిహితుం డైన ప్రహస్తుం డనురణకోవిదు నిరీక్షించి యిట్లనియె.
| 1002
|
| ఉ. |
రాక్షసవర్య వైరులు పురం బరికట్టి కలంచుచున్నవా
రక్షయబాహుశౌర్యమున నద్భుతవైఖరి వారి నెల్ల జ
న్యక్షితి గీటణంచి పొలు పారఁగ నాకు జయం బొసంగఁగా
దక్షుఁడ వీవె గావె మఱి దానవుఁ డన్యుఁ డొకండు గల్గునే.
| 1003
|
రావణుఁడు ప్రహస్తుని వానరులమీఁదికిఁ బంపుట
| సీ. |
ఈయొడ్డు భేదింప నెవ్వారుఁ జాలరు దానవబలపతి వైననీవు
నేనును నతికాయుఁ డింద్రజితుండును గుంభకర్ణుండు నికుంభుఁ డంతె
గాని వేల్పులు చూచి కడువడి మనలఁ జుల్కనఁ జూడకుండఁగఁ గడిమి మెఱసి
వలసినచందాన బలములఁ దోడ్కొని విజయార్థ మిప్పుడె వెడలు మచటి
|
|
| తే. |
కీవు వెడలినమాత్రాన భావితాత్ము
లైనదానవవీరుల మానితోగ్ర
రవము విని భీతిఁ బఱతురు ప్లవగు లుర్వి
మృగములు చలించి పఱచుట కేమి యరిది.
| 1004
|
| క. |
కపు లవినీతులు మృగములు, చపలాత్ము లయుక్తమతులు చలచిత్తులు నీ
విపులధ్వని వినఁజాలరు, ద్విపములు సింహస్వనంబు విన లేని గతిన్.
| 1005
|
| క. |
నగచరసైన్యము విద్రుత, మగుచుండఁగ నవశుఁ డై నిరాలంబుం డై
జగతీంద్రుఁ డనుజయుతముగ, నగణితబల భవదధీనుఁ డగు నిక్కముగన్.
| 1006
|
| వ. |
మఱియు సంగ్రామంబునందు జయాపజయంబుల కవ్యవస్థితత్వంబు గలుగుటం
జేసి పాక్షికజయసద్భావంబువలన మరణంబు సంశయితం బగుటం జేసి యది
శ్రేయస్కరం బై యుండు యుధ్ధంబు లేనియెడ శత్రువులచేత మరణంబు నిస్సం
శయం బగుటం జేసి యది శ్రేయస్కరంబు గాదు మదుక్తార్థవిషయంబునందుఁ
బ్రతికూలానుకూలంబులు యోచించి హితం బెయ్యది దాని నెఱింగింపు మనిన
వాహినీనాయకుం డగుప్రహస్తుండు భార్గవుం డసురేంద్రునకుంబోలె రాక్ష
సేంద్రున కిట్లనియె.
| 1007
|