ఇట్లు వృక్షప్రహారంబున గతాసుం డై పుడమిం బడినయకంపనుం జూచి
తక్కినరక్కసు లుక్కు సెడి భయభ్రాంతులై యాయుధంబులు విడిచి శిరోజం
బులు వీడ నంగంబులు వడంక నిట్టూర్పులు వుచ్చుచు స్వేదబిందుసందోహం
బులు స్రవింప నొండొరులకుం జెప్పక సారెసారెకుఁ దిరిగి తిరిగి సూచుచు
భగ్నమనస్కులై ప్రాణభయంబునఁ గనుకనిం బఱచి లంక సొచ్చినప్పుడు మహా
బలు లగువానరులు పరమానందభరితాంతఃకరణు లై సత్త్వసంపన్నుఁ డైన
హనుమంతుని సాధువాక్యంబులం బ్రశంసించి యమ్మహావీరశిఖామణిచేతం బ్రత్య
భినందితు లై తదీయవిజయం బెల్లవారికిం దేటపడునట్లుగా హర్షోత్కర్షంబున
సింహనాదంబులు చేసి రిటు మహాబలనందనుం డగుహనుమంతుండు నాలవ
నాఁటియుద్ధంబున రాక్షసేంద్రుం డగునకంపనుం బరిమార్చి తత్సహచరుల
ననేకరాక్షసుల వధించి విజయలక్ష్మీవిరాజమానుం డై కైటభాసురునిగీ టణం
చినవిష్ణుదేవునికరణిం దేజరిల్లుచుండె నమ్మహావీరునిపరాక్రమంబు విలోకించి
మిన్నునం బన్నిన సురసిద్ధసాధ్యులు బహువిధంబులఁ బ్రస్తుతించిరి మహాను