| |
సుభటసందోహంబులం బాఱి చమరుచు ని ట్లనేకప్రకారంబుల మహోక్షంబుల
గుంపులసొంపు పెంపారఁ గుప్ప నుఱిచినతెఱంగున నద్భుతంబుగా నుఱుమా
డిన నద్దనుజసైన్యంబులందుఁ బగిలినశిరంబులును దెగినకంఠంబులును దునిసి
పడినబాహువులును నఱవఱ లైనయుగంబులును జిందఱవందఱు లైననడు
ములును విలూనంబు లైనతొడలును వ్రక్క లైనపిక్కలును రూపు సెడిన
సర్వావయనంబులుం గలిగి పెక్కండ్రు రక్కసులు మడిసి రాసంగరాంగణంబు
హతకళేబరరాసులును గెడసినగజంబులతెట్టెలును గొండ పొడువునం గూలి
యున్న వీరభటపుంగవులును రాలినభూషణరజంబును బాఱెడుబహురుధిర
నదీప్రవాహంబులును రొంపిగొనినమేదోమాంసమస్తిష్కపంకంబును దిప్పలై
పడి యున్నశిలాపాదపంబులును రాశీభూతంబు లైనవివిధాయుధఖడ్గంబులుం
గలిగి దారుణదర్శనం బయ్యె నవ్విధం బంతయు విలోకించి యకంపనుండు
తీవ్రం బగుకోపం బవలంబించి వీరావేశపరవశుం డై కార్ముకగుణప్రణాదంబు
సేయుచు సారథి నవలోకించి యి ట్లనియె.
| 984
|
| సీ. |
కంటె సారథి భుజాగర్వాభియుక్తు లై చండవిక్రమమున గండు మిగిలి
పెక్కండ్రువానరు లుక్కునఁ జెలరేగి సమరస్థు లైనరాక్షసుల నెల్లఁ
బలుదెఱంగుల శిలాపాదపహతులచే సమయించుచున్నారు సైన్య మెల్లఁ
జచ్చియు నొచ్చియు విచ్చి భయంబునఁ బాఱుచున్నది నేఁడు వీరి నెల్ల
|
|
| తే. |
శాతశరముల వధియించి జమునిపురికిఁ, బుత్తు రయమున నరదంబు పోవనిమ్ము
నీ వనిన నాతఁ డాతనిభావ మెఱిఁగి, చెచ్చెర రథం బచటికిఁ బోనిచ్చుటయును.
| 985
|
హనుమంతుఁ డశంపనునితో యుద్ధము సేయుట
| సీ. |
వడిగండ్లు గురియుచు వడి మింటఁ జనుమహాజలదంబుకైవడిఁ జలము మెఱయ
బెడిదంపుటంపటి కడువడిఁ గురియుచు దారుణసింహనాదంబు సెలఁగఁ
బటురభసంబునఁ బఱతెంచి వానరయూథపశ్రేష్ఠుల నుక్కడంచి
వీఁకతో బలము చీకాకు గావించుచు మత్తద్విపముమాడ్కి మాఱు లేక
|
|
| తే. |
చాల విహరించునాతనిమ్రోల నిలువ, లేక కపు లంద ఱలికి నల్దెసలఁ బఱవ
నయ్యకంపనుఁ డనెడుఝుంఝూనిలమున, కనిలసుతుఁ డద్రికైవడి నడ్డపడియె.
| 986
|
| మ. |
బలవంతుం డగుగంధవాహసుతుఁ డిబ్బంగి న్భుజావిక్రమో
జ్జ్వలుఁడై దానవవీరుఁ దాఁకుటయు సర్వంబు న్విలోకించి త
ద్విలసద్వీర్యము నాశ్రయించి మరలం దెల్వొంది కీశు ల్మహా
బలులై గ్రమ్మఱఁ బోరఁ జొచ్చి రొగిఁ దత్పార్శ్వంబుల న్బల్విడిన్.
| 987
|
| ఉ. |
అప్పుడు పర్వతంబుక్రియ నడ్డము నిల్చినవాయుపుత్రునిం
దప్పక చూచి రాక్షసుఁడు దారుణమేఘము వర్షధారలం
గప్పినమాడ్కి దీవ్రశితకాండపరంపరల న్మహోద్ధతిం
గప్పి నభంబు బె ట్టవియఁగాఁ బృథునాద మొనర్చెఁ జెచ్చెరన్.
| 988
|