| క. |
రాక్షసనాయక రణమున, దక్షత గల దేని నీకుఁ దరుచరుకడ కీ
వీక్షణమునఁ గిష్కింధకు, నక్షీణజవప్రతాప మడరఁగ జనుమా.
| 279
|
| క. |
అని హిమవంతుఁడు పలికిన, విని రక్షోధిపుఁడు క్రోధవివశుండై గ్ర
క్కునఁ గిష్కింధకు వాలినిఁ, గన వచ్చెం జన్యకాంక్ష గడలుకొనంగన్.
| 280
|
| వ. |
ఇత్తెఱంగునఁ గిష్కింధకుం జనుదెంచి ప్రావృట్కాలంబునందుఁ దోయపూర్ణం
బైనమహామేఘంబుకరణి మేనుఁ బెంచి ఘోరం బగు మహిషరూపంబుఁ దాల్చి
తత్పురద్వారంబు నాక్రమించి పాదఘట్టనంబునం బుడమి వడంక సమీపస్థం
బు లగువృక్షంబుల నూరువేగంబున బడలుపడంజేయుచు ఖురప్రహతుల ధరణి
విదారించుచు మదోద్దండశుండాలంబులీల విషాణాగ్రంబులఁ బ్రాకారగోపురం
బులు విఱుగం ద్రోయుచు నాదుందుభి దుందుభియట్ల గర్జించుచు నట్టహాసంబు
జేసినఁ దదీయభైరవస్వనంబు విని యంతఃపురగతుం డగువాలి యమర్షణుండై
తారాసహితుం డైనచంద్రుండుం బోలెఁ దారాప్రభృతికాంతాసహితుండై
శీఘ్రంబున లేచి యంతఃపురంబు వెలువడి రయంబునం బఱతెంచి యారక్కసుం
గాంచి వ్యక్తాక్షరపదం బగుమితవాక్యంబున ని ట్లనియె.
| 281
|
| ఉ. |
ఓరి నిశాట వానరకులోత్తముఁ డంచితశౌర్యశాలి జం
భారిసమానవీర్యుఁడు మహాబలవంతుఁడు వాలి తత్పుర
ద్వారము నడ్డగించి భయదక్రియ ఘోష మొనర్చె దేల నీ
కీరస జీవితాశ గలదేని తోలంగి యథేచ్ఛ నేగుమీ.
| 282
|
| ఉ. |
నా విని దానవుండు నయనంబుల నెఱ్ఱఁదనంబు దోఁపఁగా
దైవతరాజనందనునిఁ దప్పక చూచి వనాటశేఖరా
నీ వొకపోటుబంటుకరణిన్ గఱిత ల్వినఁ బ్రేలె దేల నా
లావును నీదులావును జలంబునఁ బోరినఁ దెల్ల మయ్యెడిన్.
| 283
|
| సీ. |
హరివర ని న్నెప్పు డాజిఁ ద్రుంపఁగఁ గల్గునో యని తమకించుచున్నవాఁడ
నైనను మదమోహితాస్తుండ వై యున్నకతమునఁ దునుమ యుక్తంబు గాదు
మత్తుని సుప్తుఁ బ్రమత్తు నాయుధహీను నాజిఁ జంపిన భ్రూణహత్య యండ్రు
గాన నీనిశ నెటులైనఁ దాల్మి వహించి యుండెద రణధర్మ మూఁది నీవు
|
|
| తే. |
ప్రియలతోఁ గూడి మదనసంక్రీడ సలిపి, రిక్థ మర్థుల కొసఁగి సుహృదులకును బ
దార్థము లొసంగి సుతు వీటి కధిపుఁ జేసి, వేగునంతకుఁ బోరికి వెడలి రమ్మ.
| 284
|
వాలి దుందుభికాయము మతంగాశ్రమమునం బడునట్లు పాదాంగుష్ఠముచేఁ జిమ్ముట
| వ. |
అని పరిహాసంబుగాఁ బలికిన నారక్కసునివచనంబులకుం గనలి తారాప్రభృతి
కాంతలం బరిత్యజించి నన్ను మత్తుండ వని ప్రహసించితివి గదా నీకు
రణంబున ధైర్యంబు గలదేని యొక్కింతసేపు దలఁకక నిలిచి మదీయపాణి
ప్రహారంబు గొను మీమదంబు యుద్ధోపక్రమంబునం దుత్సాహవర్ధ
నార్థంబు గావించిన వీరపాణంబున నైనయదిగా నెఱుంగు మని పలికి సంరంభ
|
|