Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుషేణుఁడు సుగ్రీవునకు దివ్యౌషధము లుండు స్థలమును దెల్పుట

వ.

అని యిట్లు సూర్యనందనుం డగుసుగ్రీవుండు సంక్రుద్ధుండై యతిబలవిక్రమోప
పన్నంబు లగుస్వవాక్యంబులచేత వానరుల కుత్సాహబలప్రవర్ధనంబు గావించె
నప్పు డామహానుభావునివాక్యంబు విని సుషేణుండు కపీంద్రా తొల్లి దేవాసు
రులకు దారుణం బగురణంబు చెల్లె నప్పుడు సర్వాస్త్రవిదు లగురాక్షసులు
శరపరంపరాసంస్పర్శకోవిదు లై సారెసారెకు దివ్యాస్త్రజాలంబులం గప్పుచు
నిర్జరుల నిర్దించిన నష్టప్రాణు లై నష్టసంజ్ఞులై పుడమిం గూలియున్న దేవతలం
జూచి మహాత్ముం డగుబృహస్పతి మంత్రప్రచురంబు లైనమృతసంజీవనీప్రభృ
తివిద్యావిశేషంబులచేతను దివ్యౌషధంబులచేతను వారి నందఱఁ బునస్సంజీవి
తులం గావించె నట్టిదివ్యౌషధంబు లమృతం బెచ్చట మథితం బయ్యె నట్టి
క్షీరసముద్రమధ్యంబునం గలచంద్రద్రోణాఖ్యశైలంబునందు దేవతలచేత
నిక్షేపింపంబడియున్నవి యయ్యౌషధంబులు సౌవర్ణకరణిసంధానకరణివిశల్య
కరణినామకంబు లై యుండు నిప్పు డీమహాబలుం డగుహనుమంతుండు సం
పాతిపనసాదియూథపులం గూడి యచ్చటికిం జని యమ్మహౌషధంబులు గొని
తెచ్చెనేని యీరామలక్ష్మణులు విశల్యు లగుదు రని పలికిన నప్పుడు వాయు
వుం డచ్చటికిం జనుదెంచి రామచంద్రు నవలోకించి యి ట్లనియె.

869

వాయువచనంబున రాముఁడు గరుత్మంతుని ధ్యానించుట

తే.

రామ రామ మహాభాగ రాక్షసారి
యుర్వి నిబ్బంగి నవతార మొందినట్టి
యాదినారాయణుఁడవు నీ వాత్మలోన
నిన్ను నీవు స్మరింపుము నేర్పుకలిమి.

870


క.

అనఘాత్మ మహాబలుఁ డగు, వినతాసుతు దేవు నిఖిలవిషధరవైరి
న్మనమునఁ దలఁపుము ఫణిబం, ధనమువలన ముక్తు లయ్యెదరు మీరు వెసన్.

871


క.

నా విని రఘువర్యుఁడు తన, భావంబున సంస్మరించెఁ బన్నగవైరిన్
శ్రీవల్లభరథు నతిబలు, దేవవరిష్ఠుని సువర్ణదేవునిఁ బ్రీతిన్.

872


ఉ.

పాయక యిట్లు రాఘవుఁడు భావమునం దలపోయునంతలోఁ
దోయధిపంక్తుల న్జలధితోయము లంతటఁ దూలి పర్వఁ గాఁ
దోయధివాసినాగములు తోయధులందు మునింగి దాఁగ ఘో
రాయతపక్షపాతచలితాచలుఁ డై ఖగరాజు వచ్చినన్.

873

గరుత్మంతుఁడు రామలక్ష్మణుల విశల్యులఁ జేయుట

క.

వచ్చినవినతాసుతుని ర, యోచ్చలితద్వీపసంభవోర్వీరుహునిం
జెచ్చెరఁ గని మోదంబున, విచ్చలవిడి విపినచరులు వినుతించి రొగిన్.

874