Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నురుగతి వ్రేల్మిడిం దునుమనోపుదు వైనను వానిశౌర్యమున్
గురుభుజశక్తియున్ ధృతియుఁ గోరి వినం దగు నీకుఁ దెల్పెదన్.

271


వ.

మహాత్మా నావలనఁ దత్పరాక్రమాదికంబు విని యవ్వలఁ గర్తవ్యకార్యంబు
నిశ్చయింపు మని పలికి యి ట్లనియె.

272


చ.

పడమటివార్ధినుండి నరపాలమణీ యలప్రాక్పయోధి క
ట్లుడుగక దక్షిణాంబునిధినుండి రయంబుస నుత్తరాబ్ధికిం
గడువడి నతిక్రమంబున జగన్నయనుం డుదయించు నంత కిం
పడర నతిక్రమించి విమలార్ఘ్య మొసంగును దజ్జలంబులన్.

273


చ.

ధరములమీఁది కెక్కి, వడిఁ దచ్చిఖరంబులు దోర్బలంబునం
బెఱికి సభంబుమీఁది కెగమీటుచుఁ గ్రమ్మఱఁ జేతఁ బట్టుచుకో
సురగిరిధీరుఁ డానముచిసూదనపుత్రుఁడు క్రీడ సల్పుఁ దాఁ
గర మనురక్తి బాలకుఁడు కందుకకేళి యొనర్చుకైవడిన్.

274


ఆ.

మఱియు నతనికఠినచరణఘట్టనమునఁ, బిండి యగు సమస్తగండశిలలు
భూరిసార మైనయూరువేగంబున, విఱిగి కూలు భూరితరువు లెల్ల.

275

సుగ్రీవుఁడు రామునికి వాలి దుందుభిని సాధించినవృత్తాంతంబుఁ దెల్పుట

సీ.

సమదనాగసహస్రసత్త్వుఁడు కైలాసశిఖరతుల్యుఁడు సరోత్సేకపరుఁడు
దుందుభి యనునొక్కదుష్టదైత్యుఁడు లులాయాకృతిఁ గైకొని యబ్ధిఁ గదిసి
తనతోడసంగరంబునకు రమ్మని పిల్వ నతఁడు సముస్థితుం డగుచు నాకు
నీతోడఁ బోరాడ నేర్పు లే దట్టి బలాధ్యునిఁ జెప్పెద నభవుమామ


తే.

యచలనాథుఁడు హిమవంతుఁ డనఁగఁ దనరు, నతఁడు నీతోడఁ బోరాడ నర్హుఁ డరుగు
మనిన శరధి భీతుండయ్యెనని తలంచి, రాక్షసుం డేగెఁ బర్వతరాజుకడకు.

276


వ.

ఇత్తెఱంగునఁ జాపచ్యుతం బైనశరంబుపగిది భీషణరభనాతిరేకంబుగా హిమ
వంతుని డాయం జని తదీయవిపులశిఖరంబులు కొమ్మలం జిమ్ముచు గిరినిర్ఝరకం
దరంబులు ఖురాగ్రంబులం గోరాడుచు భైరవస్వనపూర్వకంబుగా నట్టహాసం
బుఁ జేసిన నగ్గిరిరాజు శ్వేతాంబుదాకారుండును సౌమ్యరూపుండును బ్రీతికరా
కృతియు నై నిజశిఖరాగ్రంబునం గూర్చుండి యారక్కసుం జూచి యేను గల
మునులకు నాశ్రయుండ రణకర్మంబులయం దసమర్థుండ నన్నుం దొడరుట నీకుఁ
గర్జంబు గాదనిన వాఁడు క్రోధసంరక్తలోచనుండై యట్లేని నాకుఁ గయ్యం బొ
సంగునంతబలంబు గలవాని నొక్కనిం బేర్కొను మని పలికిన ననుక్తపూర్వం
బైనవానివచనంబు విని క్రోధంబున నతం డి ట్లనియె.

277


చ.

అలఘుపరాక్రముండు దివిజాధిపపుత్రుఁడు వానరుండు దో
ర్బలవిభవాధికుండు రిపుభంజనుఁ డాహవశీలి వాలి నాఁ
గలఁ డొకఁ డమ్మహాబలునిఁ గానఁగ నేగు మతండు దక్క న
న్యులకుఁ దరంబె రాక్షసకులోత్తమ ని న్నెదిరించి పోరఁగన్.

278