Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

510 గోపీనాథ రామాయణము విడిచి తనంతఁ దానె నను వేడుక మీఱ పరించునే కదా. చ. అని యిటు పల్కి పంక్తిముఖుఁ డాత్మ పురంబు నలంకరింపఁ గాఁ బనిచి ప్రచండ వీర్యు లగు పార్థివసూనులు రామలక్ష్మణు లునుకొని వజ్ర పాణిజిన మోఘశంబులు భిన్న దేహు లై 802 యనిమొన నేఁటిరాత్రి హతులై రని చాటఁగ బంచె నప్పురిన్. అభిండి, రాక్షస స్త్రీలు సీతను బుష్పకంబుపై నెక్కించుకొని యుద్ధభూమికిఁ దొడ్కొనిపోవుట, ఈఈ సీ. రాక్షసాంగన లంత రావణుపనుపున నవ్యపుష్పకవిమానంబు గొనుచుఁ దడయక త్రిజటాయుతంబుగ జానకి పాలికి వెస నేగి భర్తృశోక కర్శిత యైనయాకమలాక్షీ సద్దివ్య యానంబుపైఁ ద్రిజటాన్వితముగ నెక్కించుకొని రయం బెసఁగ నాకాశమార్గమున రణావనిఁ గదియ సరిగి ఆ. శక్రజిత్ప్రయు క్తశరనికృత్తాంగు లై, ధాత్రిఁ గూలియున్న దాశరథులఁ 808 బైరుమాడ్కిఁ బుడమీఁ బడి యున్నకపిసైన్య, సమితిఁ జూపి రపుడు జనకసుతకు, వ. ఇట్లు రాక్షస స్త్రీ సందర్శితం బైసవానరసైన్యంబును బ్రహృష్టు లైన రాక్షసుల ను విప్రవిద్ధశరాసనులై విధ్వస్తకవచులై విశిఖవిదారిత సర్వావయవులై శరస్తం బమయులై శరతల్పగతులై విసంజ్ఞులై నిమీలిత నేత్రులై పాంసుపరిచ్ఛన్నగాత్రు లై రణమేదినిం బడి యున్నవారిఁ బుండరీకవిశాలాక్షులఁ గుమార సంకాశుల జీవసమ ప్ర భావులఁ బురుష శ్రేష్ఠుల రామలక్ష్మణుల నవలోకించి వారిచుట్టునుం బరివేష్టించి దుఃఖార్తు లై యున్న హనుమదంగదాదియూథపులఁ గనుంగొని బాష్పశోకాభిహత యై రోజనంబు సేయుచు బుద్ధిమోహంబున నిక్కంబుగా హతులై రని తలంచి యిట్లని విలపించె. -సంధ్య, సీత పడియున్న రామలక్ష్మణులఁ జూచి విలపించుట, దంతం- 805 సీ. తరలాక్షి నీకు వైధవ్య మెన్నటికి లే దనిరి సాముద్రికు లరసి చూచి యజ్వలు చూచి కృతాశ్వమేధాదివి మహిషి వయ్యెద వని మాటి కనిరి మాహూ ర్తికులు చూచి మంగళాత్మిక వయ్యె దనుచు మత్సన్నిధి నాడిరి మును ధవళాణి వీర పార్థివపత్ని వై సుఖించెడ వని పలికిరి శిష్టజనులు `తే. రాముఁడు సమస్తనుగుణాభిరాముఁ డినకు లాంబునిధిసోముఁ డిటు హతుం డగుచు నుండ వారివాక్యంబు లన్నియు వ్యర్థ పయ్యె వార లందఱుఁ గడు మృషావాదు లైరి. 806 తే. జగతి నేచిహ్నములు గలసతులు భర్తృ, యుక్తలై రాజ్యపట్టాభిషిక్తులగుదు రట్టియి: పంకరుహ రేఖ లస్మదీయ, చరణములఁ బొల్చి యున్నవి చారుఫణితి. తే. అనని దుర్ల భ భాగ్య లైనట్టినీల, వేణు లెట్టిచిహ్నము లున్న విధవ లగుదు రట్టిచిహ్నంబు లెవ్వియు నరయ నాకుఁ, గాన మీదు8ఖ మెబ్బంగిఁ గలిగి నేఁడు.