Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్యానతవైరి నంగదుని యంగము నొవ్వఁగ నేసి యార్చినన్.

726


ఉ.

కోపముఁ బెంచి యంగదుఁడు ఘోరభుజబలదర్ప మొప్పఁ ద
చ్చాపము ద్రుంచి యశ్వముల సారథి నొక్కటఁ జంపి వహ్నికీ
లోపమకాంచనధ్వజము నుర్వరఁ గూల్చి రథంబు ద్రుంప వాఁ
డేపు దొఱంగి వేగ చనియెం దగ నొండొకతేరిమీఁదికిన్.

727


ఉ.

ఆతతవిక్రమంబు పొలుపారఁ బ్రజంఘుఁడు భూరిజంఘుఁ డ
బ్జాతసఖాంశుతుల్యవిలసత్ప్రదరత్రయవిద్ధుఁ జేయ సం
పాతి మనంబులోఁ గినుక పర్వ రణంబున నశ్వకర్ణభూ
జాతమున న్నిశాచరునిఁ జయ్యన వ్రేసె మదం బడంగఁగన్.

728

జంబుమాలిమిత్రఘ్నవజ్రముష్ట్యశనిప్రభులు హనుమద్విభీషణమైందద్వివిదులచేఁ జచ్చుట

చ.

అరదముమీఁదనుండి రయమార మహోగ్రుఁడు జంబుమాలి భీ
కరతరకోపవేగమునఁ గన్నుల నగ్నికణంబు లొల్కఁగా
సురుచిరశక్తిచేఁ బవనసూనుని ఱొ మ్మదరంగ వ్రేసినం
బరువడి నవ్వనాటకులపాలుఁడు కోపరసోగ్రమూర్తి యై.

729


ఉ.

వానిరథంబుపై కుఱికి వాజుల గీటణఁగించి సారథిన్
మానక చంపి హేమమయనవ్యయుగధ్వజచక్రకూబర
స్థానములం బదాహతి రస న్వెసఁ గూలఁగఁ దన్ని పాణిచే
వానియురంబు దట్టుటయు నాఁ డిలఁ గూలెఁ గుజంబుచాడ్పునన్.

730


మ.

పదితూపు ల్నిగిడించి శీఘ్రము నిలింపద్రోహి మిత్రఘ్నుఁడుం
గదనాసక్తు విభీషణుం బొదివినం గాలాంతకాకారుఁ డై
గదచే నాతఁడు వానిఱొమ్ము పటుదోర్గర్వం బఖర్వంబుగా
విదళించె న్సురసిద్ధసాధ్యులు దివి న్వేనోళ్లఁ కీర్తింపఁగన్.

731


చ.

మసలక వజ్రముష్టి యలమైందుని సాయకవిద్దుఁ జేసిన
న్వెస నతఁ డాగ్రహించి భుజవీర్య మెలర్పఁగఁ దచ్ఛతాంగము
న్విసువక యశ్వసారథులవిద్రుమకేతన ముర్విఁ గూల్చి య
య్యసురునిఁ జంపె ముష్టిహతి నద్రిచరు ల్ముద మంది చూడఁగన్.

732


చ.

ద్వివిదుఁడు వేడ్క నొక్కపృథివీధరశృంగముఁ దెచ్చి తోడివా
రవు నన దోర్బలం బెసఁగ నయ్యశనిప్రభుమీఁద నేసినం
బవినిభతీక్ష్ణబాణములఁ బర్వతము న్విదళించి దైత్యుఁ డా
ద్వివిదునిమీఁద నేసెఁ బటుతీవ్రసుపర్వశితాస్త్రజాలముల్.

733


చ.

వనచరవీరుఁ డిట్లు పరివర్ధితసాయకవిద్ధగాత్రుఁ డై
మనమున నాగ్రహం బొదవ మానక వాజుల గీటణంచి సూ
తునిఁ దెగటార్చి కేతనము ద్రుంచి శతాంగము గూలఁ దన్ని య
ద్దనుజునిఁ గూలవైచెఁ బటుదారుణపాణితలాభిసంహతిన్.

734