Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పన్నుఁడు భూరిమాయికుఁడు పంక్తిముఖాత్మజుఁ డింద్రజిత్తు దా
నెన్నిక కెక్క జన్యమున కేగె నుదగ్రరథాధిరూఢుఁ డై.

717

వానరరాక్షసు లొండొరులం గలసి పోరుట

వ.

మఱియుఁ బ్రజంఘుండును జంబుమాలియు సుప్తఘ్నుండును యజ్ఞశత్రుండును
మిత్రఘ్నుండును నగ్నికేతుండును రశ్మికేతుండును నశనిప్రభుండును వజ్రముష్టి
యును దపనుండును బ్రతపనుండుమ గుంభుండును నికుంభుండును విరూపా
క్షుండును బ్రఘనుండును విద్యున్మాలియు మొదలుగాఁ గలపేరుగల రాక్షసవీరు
లందఱు హయగజరథంబు లారోహించి సకలసాంగ్రామికపరికరసమేతులై
ప్రచండవేగంబున భండనంబునకు వెడలి రిట్లు గజకచ్ఛపంబులును దురంగమం
డూకంబులును రథపోతంబులును వీరభటమకరంబులును నానావిధహేతిమీనం
బులును శంఖడిండీరంబులును బాహువిక్షపతరంగంబులును గలిగి రాక్షసరాజ
సేనారూపవృష్టిసమయప్రవర్ధితగంగానదీప్రవాహంబు రామసాగరంబు నుద్దే
శించి మహావేగంబునం బఱచె మఱియు గజకుంభకుచయు శంఖకంఠయుఁ జక్ర
నితంబయు మహాసివేణియుఁ గాహళజంఘికయు ధనుర్భూలతాయుక్తయు
మహాపరిఘహస్తయు నై యయ్యాతుధానపృతనేందిరభేరీపణవపటహకాహళ
మృదంగవాద్యస్వనపూర్వకంబుగా నతివిలాసంబున నిర్గమించి భద్రమూర్తి
యగురామభద్రుని వరింపం జనియె ని ట్లందఱుఁ గూడుకొని పురంబు నిర్గమించి
పర్వసమయంబునం బూర్యమాణం బైనమహోదధివేగంబులకరణి ననివార్యు
లై శంఖసహితంబు లైనశుభనీలశరీరంబులు బలాకలం గూడిన విద్యున్మండల
సన్నద్ధమేఘంబులభంగి వెలుంగ భీషణరభసాతిశయంబున వానరసైన్యంబు
గదియ నడిచి రప్పుడు తదీయచరణవిఘట్టనంబునఁ బుట్టిన మహీపరాగపటలం
బంబరంబున కంబుదత్వంబు సంపాదింపఁ దన్మహాభరణస్థగితమణిరత్నచాకచ
క్యంబులును దదీయవివిధహేతిచ్ఛటాధాళధళ్యంబులును గ్రొక్కారుమెఱుం
గులతెఱం గంగీకరించె నిత్తెఱంగున నుభయసైన్యంబులు కట్టాయితంబు లై
కయ్యంబునకుఁ దార్కొనునప్పుడు వానరసైన్యంబులందుఁ బుట్టినభీషణనిర్ఘోష
ణంబులును రాక్షససైన్యంబులం బుట్టినసింహనాదశంఖదుందుభిస్వనంబులును
గజబృంహితంబులును వాజిహేషలును రథనేమిఘంటానిస్వనంబులును మౌర్వీ
టంకారశబ్దంబులును భూమ్యంతరిక్షదివంబులందును దిగంతంబులందును సాగ
రంబులందును గులాచలంబునందును ప్రతిధ్వనులు సెలంగ నసానుప్రస్థకందరం
బైనమలయాచలంబు నిండి చెలంగె నిట్లు కూడుకొనినవానరులకు రాక్షసు
లకుఁ దొల్లి దేవాసురలకుంబోలె దారుణం బగుసంగ్రామం బయ్యె నప్పుడు
రాక్షసులు నిజవిక్రమంబు ప్రకటింపం జేయుచుఁ బ్రదీప్తగదాముసలముద్గర
భిండివాలకరవాలశక్తితోమరపరిఘపట్టిసప్రాసశూలకుంతప్రముఖనిఖిలాయుధం
బులు దట్టంబుగాఁ బఱపిన నవ్వానరశ్రేష్ఠులు కోపించి.

718