Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావణుఁడు వానరులమీఁదికి రాక్షసదండనాథులం బంపుట

ఉ.

దానవదండనాథులఁ బ్రతాపవిశిష్టులఁ జూచి మీ రిఁకన్
మానుగ నాత్మసేనల ఘనంబుగఁ గూడి మనంబులో నెగు
ల్మాని ప్రచండవేగమున గ్రక్కున నేగి మహారణంబులో
వానరవీరులం దునిమి వచ్చి జయం బొసఁగుండు నా కొగిన్.

710


ఉ.

నా విని యానిశాటులు మనంబున మిక్కిలి జన్యకౌతుకం
బావహిలంగ శీఘ్రమున నాత్మబలంబులఁ గూర్చి పేర్చి నా
నావిధసాధనంబులు ఘనంబుగఁ దాల్చి యలంకృతాంగు లై
రావణుచే ననుజ్ఞఁ గొని రాజితవిక్రమసార మొప్పగన్.

711


ఉ.

మించినవేడ్కతో దెసలు మిన్ను చలింపఁ బ్రయాణభేరి వ్రే
యించి ప్రచండశౌర్యము వహించి ముఖానిలపూరితప్రభో
దంచితశంఖనాదము నుదగ్రభయానకసింహనాదము
ల్మించి పురంబు నిండ నవలీల రణంబున కేగి రుద్ధతిన్.

712


ఉ.

కొండలకైవడిం దనరు గొప్పశరీరము లొప్పఁ బద్మగ
ర్భాండము వ్రక్కవాఱ భయదాయతభీషణబృంహితధ్వనుల్
మెండుగ సల్పుచు న్శ్రుతిసమీరముల న్ఘనము ల్చలింప వే
దండచయంబు లొక్కమొగి నాజికి నేగె నిరంతరంబుగన్.

713


చ.

సురుచిరరమ్యదేవమణిశోభితము ల్బృతరంధ్రభాగముల్
గురుతరరోచమానములు గూడినకంఠతలంబు లొప్పఁగా
శరధులభంగి నూర్ముల వెస న్ధరణీతల మాక్రమించుచున్
విరహరు లేగె హేషితరవంబు లెసంగ మనోజవంబునన్.

714


సీ.

చటులధ్వజాగ్రసంఘటితపటానిలవేగంబున మొయిళ్లు విచ్చి పాఱఁ
గమనీయనేమిసంఘట్టనంబునఁ బుట్టువసుధాపరాగ మాకసము నిండ
రణితఘంటాఘణంఘణనినాదంబులు దిక్కరికర్ణముల్ వ్రక్కలింప
సముదగ్రవేగభారము మోవఁ జాలక బ్రమసి శేషుండు భోగములు వరప


తే.

సంబరమునఁ జనుపంకజాప్తరథము, కరణిఁ జూడ్కికి దుర్నిరీక్ష్యంబు లగుచు
నఖిలసాంగ్రామికరథంబు లద్భుతగతి, మొనసి దట్టంబుగా రణంబునకు వెడలె.

715


చ.

పరశుగదాసికుంతములఁ బ్రాసపరశ్వథముద్గరంబులం
గరములఁ బూని బిట్టలుక గాటుకకొండలభంగిఁ గ్రాలుచున్
గురుతరసింహనాదములు ఘోరముగా భువి నిండ యామినీ
చరు లతిదారుణక్రియ నసంఖ్యులు పోరికి నేగి రత్తఱిన్.

716


ఉ.

మున్ను రణంబులో దివిజముఖ్యుని శక్రు జయించి కీర్తిఁ గై
కొన్న భుజబలాధికుఁ డకుంఠితశౌర్యుఁ డమోఘవీర్యసం