| |
నొక్కముహూర్తంబు విశ్రమించి రోషరూక్షప్రేక్షణంబుల దశదిశలు వీక్షిం
చి ముందట నతిరమ్యం బై త్రికూటశిఖరాగ్రభాగంబున విశ్వకర్మనిర్మితం బై
రమ్యకాననశోభితం బై మహోన్నతం బై యొప్పుచున్న లంకాపట్టణంబు నవ
లోకించి తత్పురగోపురశిఖరాగ్రంబున.
| 636
|
శ్రీరాముఁడు రావణునిం జూచుట
| చ. |
తిరముగ నున్నవానిఁ బటుదీప్తదవాగ్నిపరీతనీలభూ
ధరముక్రియ న్శశక్షతజతామ్రసువర్ణపటావృతాంగుఁ డై
వఱలెడువాని నీలఘనవర్ణసవర్ణత నొప్పువాని భా
సురతరనూతనాభరణశోభితుఁ డై తగువాని వెండియున్.
| 637
|
| క. |
ఘనసంధ్యాతపశోభిత, ఘనరాశి నభంబుభంగిఁ గడులోహితచం
దనలిప్తశరీరుం డై, తనరారెడువాని సకలదానవనాథున్.
| 638
|
| క. |
విజయాతపత్రశోభితు, నజితుని దుస్సహునిఁ బర్వతాభుని శ్వేత
వ్యజనాలంకృతపార్శ్వుని, గజనాథునిభంగిఁ జాలఁ గ్రాలెడువానిన్.
| 639
|
| తే. |
అనిమిషేభదంతాగ్రపీడనకృతవ్ర
ణాంకవక్షస్థలంబుచే నలరువాని
దశముఖునిఁ గాంచి దశరథతనయుఁ డపుడు
డెందమునఁ జాల విస్మయ మొందుచుండె.
| 640
|
సుగ్రీవుఁడు రావణునిపైకి దాఁటి యతనికిరీటచ్ఛత్రాంగదధ్వజములం దన్నుట
| వ. |
అప్పు డావానరేశ్వరుం డగుసుగ్రీవుండు రాక్షసేంద్రసందర్శనసంజాతక్రోధా
విష్టచిత్తుం డై బలసత్వంబు లినుమడింప రయంబున లేచి యచలాగ్రంబున
నుండి గరుడానిలతుల్యవేగంబున రావణుం డున్నగోపురాగ్రంబుమీఁదికి నొ
క్కరుండై సాహసంబున లంఘించి యొక్కముహూర్తంబు నిలిచి వానిచందం
బెల్ల నిమ్ముగా విలోకించి వానిఁ దృణప్రాయంబుగా నెంచి నిర్భయనిష్కంపావ
స్థానుండై పరుషంబుగా వాని కి ట్లనియె.
| 641
|
| ఉ. |
మిత్రకులాగ్రగణ్యునకు మేచకమూర్తికి రామభర్తకున్
మిత్రుఁడ దాసుఁడ న్బలసమేతుఁడ వానరలోకనాథుఁడన్
మిత్రకుమారుఁడ న్జగతి నింద్యచరిత్రుని నిన్ను నిర్జరా
మిత్రుని గీటణంచుటకు మేల్పడి వచ్చినవాఁడ నెంతయున్.
| 642
|
| చ. |
అని రయ మారఁ బల్కి ప్లవగాధిపుఁ డుద్దతి వానిమీఁదికిం
జని కమనీయరత్నమయచారుకిరీటము తన్మనోజ్జచం
ద్రనిభసితాతపత్రమును దత్కనకాంగదము ల్పతాక మే
దినిఁ బడఁ దన్ని ధాత్రి కతిధీరత దాఁటె లఘుత్వ మేర్పడన్.
| 643
|
| మ. |
కపినాథుం డిటు దాఁటి గ్రమ్మఱ భుజాగర్వంబు దీపింప దై
|
|