| |
వద్విభీషణాంగదనలనీలశరభశతవలిపనసకుముదవినతమైందద్వివిదసుషేణగజగ
వయగవాక్షగంధమాదనరంభతారదరీముఖప్రముఖులం జూచి యి ట్లనియె.
| 602
|
| సీ. |
దుష్ప్రధర్షం బైనదోషాటవిషయంబుఁ జేరితి మది నిలింపారిబాహు
రక్షిత యై పొల్చు లంకాపురం బిది సురగరుడాహికిన్నరుల కైన
దుర్జయం బైనది దుష్టాత్ముఁ డగువైరిఁ బొలిపుచ్చి కార్యంబు పొందుపఱచు
నట్టిమంత్రము సేయుఁ డాదశాననుఁ డున్నచొప్పు విచారించి చెప్పుఁ డనిన
|
|
| తే. |
నప్పుడు దశాననానుజుం డమరతుల్యుఁ, డావిభీషణుఁ డభిముఖుం డగుచుఁ బుష్క
లార్ధ మగ్రామ్యపదవంతమై తనర్చు, వాక్యమున నిట్టు లనియె భూవరునితోడ.
| 603
|
విభీషణుఁడు రామునకు రావణకృతగుప్తికకర్మప్రకారం బెఱింగించుట
| సీ. |
అనఘాత్మ సంపాతి యనలుండు ప్రఘసుండు శరభుండు ననెడు నల్వురునయజ్ఞు
లస్మదీయామాత్యు లట లంకకుం జని యచ్చటివృత్తాంత మంత యెఱిఁగి
వచ్చి చెప్పిరి నాకు వరుసతో నవ్వార్త వినిపింతు వినుము సవిస్తరముగఁ
గలుషాత్ముఁ డగుదశకంఠునిపనుపున నల ప్రహస్తుండు సేనాధిపుండు
|
|
| తే. |
లంకతూరుపువాకిట శంక లేని, వలతులు మహోదరుఁడు మహాపార్శ్వు లనెడు
దైత్యు లిద్దఱు దక్షిణద్వారమందుఁ, గాచి యున్నా రనేకరాక్షసులఁ గూడి.
| 604
|
| చ. |
కడిమి దలిర్పఁ గ్రాసములు ఖడ్గములుం బటుభిండివాలము
ల్తడయక పూని శూరు లగుదైత్యు లనేకులు తన్నుఁ గొల్వఁగా
నుడుగక రాక్షసేంద్రసుతుఁ డుగ్రమనస్కుఁడు మేఘనాదుఁ డా
పడమటివాకిట న్నిలిచి బాగుగఁ బ్రోవఁగ నున్నవాఁ డొగిన్.
| 605
|
| క. |
మును బహుసంగ్రామంబుల, వినుతికి నెక్కినమహోగ్రవీరనిశాటు
ల్తనుఁ గొల్వ నుదగ్ద్వారం, బున రావణుఁ డున్నవాఁడు భూవరముఖ్యా.
| 606
|
| క. |
ఘనుఁడు విరూపాక్షుం డను, దనుజుఁడు పటుశూలఖడ్గధరు లగుదనుజు
ల్తనుఁ గొల్వఁగఁ బురమధ్యం, బున నిలిచినవాఁడు పృథుచమూసహితుండై.
| 607
|
| తే. |
దశముఖుం డివ్విధంబునఁ దనపురంబు, కడిమి నెవ్వరు సొరకుండ కాపుఁ బెట్టి
వీటిలో సంగరం బని చాటఁ బంచి, యుద్ధసన్నద్ధుఁడై గ్రాలుచున్నవాఁడు.
| 608
|
| వ. |
మఱియు వేవురు గజయోధులు బదివేలరథికులు నిరువదివేలయాశ్వికులును
సాగ్రకోటిరాక్షసులును యుద్ధసన్నద్ధు లై యున్నవారు వీరు రాక్షసరాజునకు
నజస్రంబు నిష్టులై యుందు రీపరిగణితగజయోధిప్రభృతిచతుర్విధరాక్షసుల
యం దొక్కొక్కనికి దశలక్షరాక్షసులు వశవర్తులై యుందురు వారంద ఱిప్పుడు
యుద్ధోద్ధకృతోత్సాహు లై యున్నవారు మఱియుఁ గుబేరునితోడ రణంబు
నకుఁ దొడరినప్పుడు యక్షులతో సంగ్రామంబుఁ జేసి జయంబు గొన్నరాక్షసు
లఱువదిలక్ష లున్నవారు తేజోవీర్యపరాక్రమదర్పసత్త్వగౌరవంబుల రావణు
నకు సరివచ్చువారు మహాత్మా రావణబలవర్ణనవిషయంబునందు మీకుఁ గోపంబు
|
|