| క. |
వైరిప్రోత్సాహముననొ, భారము మోచుటనొ పక్షపాతంబుననో
వీరద్వేషంబుననో, మీ రిపు డి ట్లనుట శంక మీఱెడు మదిలోన్.
| 595
|
| క. |
వినుము రిపుప్రోత్సాహన, మునఁ గాక సమస్తశాస్త్రపూర్ణుం డగువాఁ
డనుమానింపక రాజును, గని కని సభలోన నెట్లు గర్హించు భువిన్.
| 596
|
| ఆ. |
కాననముననుండి జానకి నొక్కటఁ, బద్మహీన యైనపద్మ నట్లు
మచ్చరించి యిటకుఁ దెచ్చితి నే నేల, వెఱచి రాఘవునకు మరల నిత్తు.
| 597
|
| చ. |
హరిహయకాలముఖ్యదివిజాధిపు లెవ్వనిమీఁద విక్రమం
బరుదుగఁ జూపఁగా వెఱతు రట్టిదశాననుఁ డేల పోరిలో
వెఱచు ననేకకీశపరివేష్టితు నర్కసుతు న్సలక్ష్మణు
న్నరపతి నంబకంబుల రణంబునఁ ద్రుంపనె యొక్కవ్రేల్మిడిన్.
| 598
|
| వ. |
మహాత్మా న న్నేల వెఱపించెదవు శిరోభంగం బైనఁ గాని మ్మేను బగతునితోడ
సంధిఁ గావింపంజాల.
| 599
|
| క. |
ఇది నాకు సహజదోషము, తుది యెట్లొకొ స్వాశయంబు దురతిక్రమ మె
య్యది మదికి గోచరింపదు, త్రిదశారీ నామతంబు దిరుగునె యింకన్.
| 600
|
| ఉ. |
అంబుధిమీఁద సేతువు నయంబుగఁ గట్టి వనాటసైన్యయు
క్తంబుగ దాఁటి రాఘవుఁడు గ్రక్కున వచ్చిన నేమి యయ్యె యు
ద్ధంబున మత్కరోల్లసితదారుణచాపవిముక్తకాండపా
తంబుల కోర్చి జీవితయుతంబుగఁ గ్రమ్మఱఁ బోవ నేర్చునే.
| 601
|
రావణుఁడు లంకకు గుప్తికర్మము సేయుట
| వ. |
అని యిట్లు సంరబ్ధపరుషంబుగాఁ బలికిన విని దుష్టుం డైనదశగ్రీవునిం జూచి
మాల్యవంతుండు వ్రీళితుం డై యేమియుం బలుకక జయంబు గొను మని
దీవించి యథోచితంబుగా నామంత్రణంబు వడసి నిజనివాసంబునకుం జనియె
నంత రావణుండు మంత్రులతో విచారించి నిశ్చయించి లంకయందు గుప్తి
కర్మం బాచరింపం దలంచి సేనాపతి యగు ప్రహస్తు నవలోకించి నీవు కతిపయ
బలంబులం గూడి పూర్వద్వారంబున నుండుము మహావీర్యులును మహాకాయు
లును నగు మహోదరమహాపార్శ్వులు పెక్కండ్ర రక్కసులం గూడి దక్షిణ
ద్వారంబు రక్షించెదరు మహామాయుం డగుశక్రజి త్తనేకరాక్షసపరివృతుండై
పశ్చిమద్వారరక్షణంబునకుం జాలి యుండు నేను శుకసారణులం గూడి యుత్తర
ద్వారంబున నుండెద మహావీర్యపరాక్రముం డగువిరూపాక్షుండు బహురాక్షస
సమేతుం డై మధ్యగుల్మంబు రక్షించుచుండు నని యిత్తెఱంగునఁ బురంబు
నకుఁ బుష్కలంబుగా గుప్తివిధానంబు గావించి తన్నుఁ గృతకృత్యునింగాఁ దలం
చుకొనుచు వారలచేత నభినందితుం డై నిజాంతఃపురంబునకుం జనియె నంత
నిక్కడ సువేలాచలంబున సలక్ష్మణుం డగురాముండు సుగ్రీవాంజనేయజాంబ
|
|