Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

నగునతికాయుండు సీతాపహరణదోషదూషితుం డైనదోషాచరవల్లభుం జూచి
నీతిభూషణభాషణంబున ని ట్లనియె.

⁠ 583

అతికాయుఁడు రావణునకు హిత ముపదేశించుట

సీ.⁠

అసురనాయక విను హరధనుర్దళనంబు పరశురామునిగర్వభంజనంబు
తాటకాహరణంబు తాటకేయవధంబు ఖరదూషణాదికఖండనంబు
మఱియు విరాధునిమరణంబును గబంధనిధనంబు వానరనేతచావు
వారిధిపై సేతుబంధంబు దానవభీకరలంకాప్రవేశనంబు

⁠


తే.⁠

నివి సమస్తంబు మనములో నెంచి చూడ
మనుజమాత్రున కయ్యెడిపనులు గావు
రాక్షసారాతి యగుహరి రాముఁ డగుచు
నిను వధింపంగ జనియించె నని తలంతు.

⁠ 585


క.⁠

జనకజ కేవల మనుజం, గన యని వంచించి కన్ను గానక యిటకుం
గొని తెచ్చితి వమ్మానిని, మనపాలిటిమృత్యు వనుచు మదిని దలంతున్.

⁠ 586


క.⁠

వీరాగ్రేసరుఁ డగురఘు, వీరునితో నీతి మాలి వీఱిఁడి వై ని
ష్కారణముగ నీ వీక్రియ, వైరముఁ గొంటి విక్ర మేలు వచ్చున నీకున్.

⁠ 587


క.⁠

పరసతులపొందు గోరుట, నరక మపయశంబు వంశనాశన మనుచుం
బరమనయజ్ఞుండవు సు, స్థిరధర్ముఁడ వైన నీకుఁ జెప్పఁగ వలెనే.

⁠ 588


క.⁠

దనుజేంద్ర సీత నిచటికిఁ, గొని తెచ్చిననాఁట నుండి ఘోరము లగుచున్
మనవీట దుర్నిమిత్తము, లనేకములు తోఁచుచున్న వద్భుతభంగిన్.

⁠ 589


క.⁠

కావున జానకి నిప్పుడు, భూవల్లభునకు నొసంగి పొలుపుగఁ బురమున్
దేవారుల నైశ్వర్యము, వావిరి రక్షించుకొనుము వాసవవైరీ.

⁠ 590


తే.⁠

రాముఁ డఖిలలోకైకశరణ్యుఁ డతని, శరణ మొందిన నపరాధశతము నైన
సైఁచి రక్షించు నతనికి జనకపుత్రి, నిచ్చి వేఁడుము విడువు మీమచ్చరంబు.

⁠ 591


వ.⁠

అని యిట్లు బహుప్రకారంబుల న్యాయానుకూలంబుగాఁ బ్రబోధించిన నద్ద
శాననుండు కాలవశంగతుండై వారలపలుకుల నాదరింపక క్రోధపరివృత్తలోచ
నుం డై మాల్యవంతున కి ట్లనియె.

⁠ 592

రావణుఁడు మాల్యవంతుని దూఱుట

క.⁠

పరపక్షగతుఁడ వై నీ, వరయఁగ నతిహితునిభంగి నహితవచనముం
గఱపెద విది నాచిత్తము, సొర దింత వివేక మెపుడు చొప్పడె నీకున్.

⁠ 593


చ.⁠

జనకనిరస్తునిం గృపణుసత్త్వవిహీనుని వానరాశ్రయున్
మనుజుని రాము నొక్కని సమర్ధునిఁగా వినుతించుచుం గరం
బనిమిషలోకకంటకుఁడ నై రజనీచరలోకభర్త నై
ఘనతఁ జెలంగున న్నొకజఘన్యునిఁగా వచియించి దేలకో.

⁠ 594