Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వైతి విప్పుడు మహాబలు లగుఋక్షగోలాంగూలనరవానరులు రభసంబున
నిచ్చటికిం జనుదెంచి దృఢవిక్రము లై గర్జించుచున్నవా రదియునుంగాక.

575


తే.

నాఁటినాఁటికి దఱుచుగా వీటఁ దోఁచు
బహువిధసమస్తదారుణోత్పాతములను
జూచి భయ మందుచున్నాఁడ సురవిమతుల
కేమి వాటిల్లునో యని నామనమున.

576


తే.

అంబరంబునఁ బన్ని రక్తాంబుదములు, ప్రళయకాలంబునాఁటిగర్జలు చెలంగ
లంకపై రక్తవృష్టి భయంకరముగఁ, గురియుచున్నవి దైత్యులగుండె లవియ.

577


చ.

విఱిగి పడం దొడంగె మనవీట ధ్వజంబులు నాజిసంఘము
ల్కరులును శోకబాష్పములు కన్నుల నించుచు నేడ్వసాఁగె భీ
కరతరజంబుకంబులును గాకసరీసృపగృధ్రఘూకము
ల్పుర మటు సొచ్చి రేపవలు మ్రోయుచు నున్నవి దారుణంబుగన్.

578


వ.

మఱియుఁ బూతనాప్రముఖశక్తులు పాండురదంతోపలక్షిత లై యువతుల నుద్దే
శించి ప్రతికూలభాషణంబులు పలుకుచు గృహగతద్రవ్యంబు లపహరించి స్వప్నం
బులయందు ముంగల నిలిచి పరిహసించుచున్నవి శ్వానంబులు బలికర్మసాధన
ద్రవ్యంబు భుజించుచున్నవి గోవులయందు ఖరంబులు వొడముచున్నయవి
మూషకబిడాలసూకరకిన్నరరాక్షసులు క్రమంబున నకులశార్దూలశునకరాక్షస
మానవులం గూడి వర్తించుచున్నవా రదియునుం గాక.

579


తే.

పాండుదేహంబులును రక్తపాదములును
గలుగువిహగంబు లొక్కటఁ గాలచోది
తంబు లై రాక్షసవినాశనంబుకొఱకు
సంచరించుచు నున్నవి సంభ్రమమున.

580


వ.

మఱియు మధురభాషణార్థంబు పంజరంబుల నుంచి పెంచినశారికలు మధుర
భాషణంబులు పరిత్యజించి వీచి కూచి యని క్రూరంబుగా మ్రోయుచున్న
యవి మఱియును.

581


క.

దనుజేంద్ర ఖగమృగంబులు, దినపతి కభిముఖము లగుచు దినదినమును రో
దన మొనరించుచు నున్నవి, మనవీటం జిచ్చు లేనిమంటలు పుట్టెన్.

582


వ.

మఱియు వికటాంగుండును భయంకరుండును గృష్ణపింగళుండును ముండిత
శిరస్కుండునై కాలుండు ప్రతికాలంబునందు రాక్షసులగృహంబు లవలోకించు
చున్నయట్లు దోఁచుచున్నవాఁడు మఱియు ననేకదుర్నిమిత్తంబులు దోఁచు
చున్నవి గావున వీని నన్నిటిని విచారించి కర్తవ్యకార్యంబు లెఱింగి యుత్తర
కాలోచితం బైనదాని విచారింపు మని యిట్లు నికృష్టు లైనరాక్షసులయం
దుత్తముం డైనమాల్యవంతుండు సత్సభామధ్యంబునం బల్కి రావణునియని
ర్తనం బెఱింగి యూరకున్న నప్పుడు నీతిశాస్త్రజ్ఞుండును వినయవిధేయుండు