Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.⁠

తనకు బలంబు లేనియెడఁ దప్పక వైరులతో సంధియుం
దనకు బలంబు గల్గునెడఁ దద్దయు నిగ్రహ మాచరించుచు
న్వినుతగతి న్స్వపక్షపరివృద్ధి యొనర్చెడునట్టిభూవరుం
డనుపమలీల నేలు విజితారియు నై ధరఁ బెక్కువర్షముల్.

⁠ 572


క.⁠

పగతుని యుపేక్ష సేయం, దగ దధికునితోడ సౌహృదంబు సమునితోఁ
దగ సంధి జఘన్యునితో, జగడం బొనరించి బ్రతుకఁజను రాజునకున్.

⁠ 573


చ.⁠

పరమమును ల్సుర ల్బువనపాలకు లెవ్వనికి న్హితైషులై
వఱలుదు రట్టిరామనృపవర్యునిపైఁ బెడబుద్ధి మాని సు
స్థిరముగ సంధిఁ జేసి వెస సీత నొసంగి నిశాటరాజ్యముం
గర మనురక్తి నేలు మటుగాక పెనంగినఁ గీడు గల్గెడిన్.

⁠ 574


వ.⁠

అది యెట్లనిన వినుము తొల్లి భగవంతుఁ డైనపితామహుండు సురాసురుల
సృజించి తదాశ్రయంబులు గా ధర్మాధర్మంబులు సృజించె ధర్మంబు మహాత్ము
లగుదేవతలపక్షం బనియు నధర్మం బసురు లగురాక్షసులపక్షం బనియును వినం
బడు ధర్మం బెప్పు డధర్మంబును హరించు నప్పుడు కృతయుగంబు ప్రవర్తిల్లు
నధర్మం బెప్పుడు ధర్మంబును హరించు నప్పుడు కలియుగం బగుదిగ్విజయార్థంబు
లోకంబులం జరించునప్పుడు నీచేత ధర్మవృద్ధి హేతుభూతంబు లైనతపోయజ్ఞదా
నాదులు వినాశితంబు లయ్యెఁ బరహింసాపరదారపరద్రవ్యావహరణాదికంబుచే
స్వపక్షభూతాధర్మంబు వివర్ధితం బయ్యెఁ గావున నక్కారణంబున శత్రువు లగు
రామాదులు మనకంటె బలవంతులై యున్నవారు నీచేతఁ బ్రమాదంబువలనఁ
బ్రవర్ధితం బైనయయ్యధర్మంబె మనల నాశంబు నొందించు సురభావనం బైన
ధర్మంబు సురల కభివృద్ధిఁ జేయుచున్నయది విషయలోలుండవై దేవర్షిప్రముఖ
కన్యాపత్నీహరణంబు గావించునట్టినీచేతఁ గాలాగ్నికల్పు లగుమహర్షులకుఁ బ్రదీ
ప్తపావకునిభంగి నతిదుస్సహం బైనమహాక్రోధం బుత్పాదితంబయ్యె వారల
ప్రభావంబు ప్రదీప్తవహ్నిచందంబున నతిదుస్సహంబై యున్నది తపస్సంభావి
తాత్ములునువై శ్వానరసూర్యకల్పులు నగునమ్మహర్షులు ధర్మాభివృద్ధికాములై రా
క్షసవినాశంబుకొఱకు వేదఘోషంబులు సేయుచు వీర్యవంతంబు లైనమంత్రం
బులచేత విధ్యుక్తప్రకారంబున నగ్నిష్టోమాదియాగంబులచేత నగ్నియందు హో
మంబులు సేయుచున్నవారు మఱియు నయ్యగ్నిహోత్రసముత్థితం బైనధూమంబు
దశదిశలు నిండి రాక్షసులతేజంబు నాశంబు నొందుచున్నయది కొందఱు
రాక్షసులు భయభ్రాంతులై యుద్ధకాలంబునందలి మేఘంబులభంగి నల్గడలం
బఱచుచున్నవారు మఱియు నయ్యైపుణ్యదేశంబులందు దృఢవ్రతు లైన
యత్తపోధనులచేతఁ జర్యమాణం బైనతీవ్రతపంబు రాక్షసులకు సంతాపంబు
పుట్టించుచున్నది తొల్లి నీవు దేవదానవయక్షులవలన భయంబు గలుగకుండఁ బర
మేష్ఠివలన వరంబు వడసితివి గాని మానుషాదులవలన భయంబు లేకుండ వడయ

⁠