Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

472 గోపీనాథ రామాయణము క. నాకుఁ బ్రియ మాచరింపఁగ, నీకుఁ బ్రియంబు గల దేవి నేర్పున దనుజుం డాకులతఁ జేయుమంత్రము, చేకొని నిజ మెఱిఁగి వచ్చి చెప్పుము నాకున్ .557 తే. అతఁడు మాయాబలుండు దుష్టాత్మకుండు క్రూరుఁడు శగుండు లోక విరుద్ధ ధర్మ సర్తనుం డర్థి ఁ గ్రోలిన వారుణి క్రియఁ జేలఁగి సారెకు భ్రమియింపఁ జేయు నన్ను. 558 559 560 మ. ఒకమా బుద్ధతిఁ గాఱు లాడు నొకమా టుగ్రాకృతిం దోఁచు వే తొకమా టల్లన మాయఁ బన్ను నొకమా టున్మాది యై చంపఁగా సుకరాశాస్యల కానతిచ్చు వల దంచుం బల్కు వేఱక్కమా టకలంకాత్ముఁడు రాముఁ డిప్పటికి రాఁ డంచు స్వచించుం దగన్. ఉ. ఎప్పటి కేమి సేయునో విశృంఖలవృత్తి దశాన్యుఁ డంచు నే దెప్పర మైన శోకమున దీనతఁ జేడ్పడి యున్నదాన నా చెప్పిడి దేమి యింక ననుఁ జేకొని ప్రోచెద వేని యిప్పుడే చెప్పు మెఱింగి వచ్చి యెడ సేయక వాని ప్రయత్న మంతయున్. చ. అన విని యానిశాటి జనకాత్మజ భావ మెఱింగి తద్విలో చనగళదశ్రు బిందువులు చయ్యన మీటుచుఁ బళ్కె దల్లి నీ పనిచినయట్లు రావణునిపాలికిఁ బోయి తదీయభావముక్ దనుజులనిశ్చయం బెఱిఁగి తప్పక వచ్చెద నీకుఁ దెల్పఁగన్, వ. అని పల్కి, యాసరమ సీతచే ననుజ్ఞాత యైయరిగి మంత్రి బాంధ వసమన్వితుండై విచారించుచున్న రావణుని సమీపంబునకుం జని దురాత్మం డగువానినిశ్చయం బెఱింగి క్రమ్మఱు శీఘ్రంబున పశోకవనికిం జనుదెంచి తనరాక కెదురు చూచు చున్న జానకిని నిష్టపద్మ యగులక్ష్మీంబో లె నవలోకించె నప్పు డదేవి పునస్సం ప్రాప యైన ప్రియసం నవలోకించి గాఢంబుగాఁ బరిరంభించి యొక్క స్నిగ్ధ వీఠంబునం గూర్చుండ నియోగించి క్రూరచిత్తుం డగు రావణునినిశ్చయం బంత యు నిక్కంబుగా నెఱింగింపు మనిన సమ్మహీనందని కది యి ట్లనియె. - సరమ సీతకు రావణమంత్ర నిశ్చయం బెఱింగించుట, పుతుం సీ. అంబుజనేత్ర నే నచటికిఁ జను వేళ మమతతో జననియు మంత్రి వృద్ధుఁ డసురనాథునికడ కరుదెంచి ప్రీతితో జనపతి రాముని సత్కరించి వై దేహి నొసఁగుమా వసుధేశ్వరుఁడు జనస్థానవాసులయందు సల్పినట్టి ఘనతరవి క్ర మకర్మం బె నీకు నిదర్శనం బది గాక తద్భటుండు . 561 562 తే. జలధిలంఘించియొక్కండెసాహసమున, నుగ్ర దైత్యులఁ బెక్కండ్రని గ్రహించె నవని నిట్టియద్భుతకర్మ మాచరింప, మనుజమాత్రున కని కెవ్వనికిఁ జెల్లు. 563