466 గోపీనాథ రామాయణము 508 క. పతి మృతిఁ బొందిన పిమ్మట, బ్రతుకంగా రాదు సతికి బ్రతికినచోఁ ద త్సతికంటె మరణ మొందిన, పతియె సుఖాత్ముండు సాధ్వి బ్రతు కథమమగున్. ఆ. అధిప నన్నుఁ గాన నరుదెంచి నాకొఱ, కసురవిభునిచేత హతుఁడ పై తి సాంద్రదుఃఖశోక సంతప్త నైననా, కింతకంటే మరణ మీంపు గాదె. క. మొదటఁ బతిమరణ మింతికి, హృదయేశ్వర దుశ్చరిత్ర హేతుక మని చె ప్పుడు రుపచారము లేకయె, యదయత నీ వెట్లు మృతుఁడవైతివో యిచటన్. తే. అధిప నీ విట్లు నిహతుండ నగుచు నుండ జాతవాత్సల్య యైన కౌసల్య సుతుఁడ వై సనీచేత హతవత్స యైన మొదవు నడువున విత్సగాఁ జేయఁ బడియె నేఁడు. తే. అరయ నెవ్వారిచేత దీర్ఘాయు సమిత తేజ మది నీకు మును సమాదిష్ట మయ్యె నట్టిదై వచింతకులవా క్కనృత మయ్యె నధిప స్వల్పాయు వైతివే యకట నేఁడు. మ. క్షితిలో దుర్వ్యసనంబుల స్వసఁ దొలంగింప నసమర్థుండ వై సతతంబు న్విజితారి వై వినయశాస్త్రజ్ఞుండ పై నిశ్చల వ్రతనిష్ఠాఖని వై వెలుంగు సుగుణవ్రాతాబ్ధికి న్నీకు దు ష్కృతికిం బోలె న కాలమృత్యు వెటు గల్గె 'న్నీఁడు ప్రాణేశ్వరా. DA యీ 510 511 512 వ. దేవా భూతంబులకుఁ బ్రభవం బైన యీ కాలం బకాలంబున నిన్ను మృతుం గావించె నక్కారణంబున ద్వద్విషయంబునందు భవిష్యదరజ్ఞానవంతు లగు దైవచింతకుల ప్రజ్ఞ నశించెఁ గావలయు నీవు వ్యసనంబులఁ దొలంగం ద్రోయుట యందు మిక్కిలి కుశలుండ వట్టియు పాయజ్ఞుండవు నయశాస్త్రవిశారదుండ వై ననీ వచింతితం బైన మృత్యువు నెట్టు లోందితివి మన్నిమి త్తంబున నతినృశం సయు రౌద్రయు నైన కాళరాత్రి చేతఁ బరిష్వజింపం బడి యిట్లు బలాత్కారం బునఁ బరిహృతుండ- వైతివె యని పలికి వెండియు నిట్లనియె. తే. అనఘచరిత తపస్విని యైన సన్ను, విడిచి మిక్కిలి ప్రియ యైనవెలఁదినట్లు గహ్వరిని బాహుయుగమునఁ గౌఁగిలించి, గాఢసు ప్తి వహించి తెకాంత నేఁడు. క. అకటా యీకాంచనకా, ర్ముకమును సతతంబు గంధపుష్పంబులచే 518 సకలుషమతిఁ బూజింపుడు, వికలత్వము నొందె నేఁడు విధిబలహతమై. 515 వ. మహాత్మా సర్వపితృసహితుం డై యున్నతండ్రి యగుదశరథునితోఁ గూడ స్వర్గంబునకుఁ జని యందు నక్ష త్ర భూతుండవై విమానంబుననుండి పుణ్యకర్మ లగువారలకుఁ గాంక్ష ణీయంబును బుణ్యంబు నగునివ్వాకు వంశంబును విలో కించు చున్నవాఁడ వే యని పలికి వెండియు నిట్లనియె. 516
పుట:గోపీనాథరామాయణము2.pdf/488
స్వరూపం