Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నందు విడిసి యున్నవాఁ డనెడుచారులవాక్యంబు విని యొక్కింత జాతోద్వే
గుం డై చుట్ల నున్నసచివుల నవలోకించి యి ట్లనియె.

485


చ.

మన కిది మంత్రకాల మిఁక మంత్రుల నందఱఁ దోడి తెండు మీ
రనిన మహాప్రసాద మని యప్పుడె దోడ్కొని వచ్చిన న్దశా
ననుఁ డటు వారిఁ గూడి కదనస్పృహ మంత్ర మొనర్చి కార్యమున్
మనమున నిశ్చయించి యలమంత్రులు నిండ్లకుఁ బంచి చెచ్చెరన్.

486


క.

తననగరి కరిగి యాప్తుని, ఘనమాయావిదునిఁ గార్యఘటనాచతురున్
దనుజుని విద్యుజ్జిహ్వుం డనువానిం బిలువ నంపి యాతని కనియెన్.

487


మ.

క్షితిపుత్రిం గడుమాయచే మనకు వంచింపం దగు న్నేఁడు నీ
వతిమాయామయ మైనరాముశిరము న్శాస్త్రస్ఫురచ్చాపమున్
జతురత్వం బలjeరఁ గైకొని రహి న్నావెంట ర cdమేను బ్రో
ద్ధతితో మున్నుగ నవ్వెలందికడ కందం బొప్పఁగా నేగెదన్.

488


క.

నా విని నిశాచరుం డటు, గావించెద ననినఁ బంక్తికంఠుఁడు మోదం
బావిర్భవింప వానికిఁ, గావలె నని యొసఁగె నొక్కఘనభూషణమున్.

489


వ.

ఇట్లు విద్యుజ్జిహ్వుని మణిభూషణప్రదానంబునఁ బ్రీతచేతస్కునిం జేసి సీతా
దర్శనలాలసుం డై మహాబలుం డగురాక్షసవల్లభుండు ప్రమదావనంబునకుం
జని యందు.

490


ఉ.

కన్నుల శోకబాష్పములు గాఱఁగ నేడ్చుచు రాక్షసాంగనల్
ద న్నడలించుమాటలకుఁ దద్దయుఁ గుందుచు రామభద్రునిం
బన్నుగ నాత్మలో నెపుడుఁ బ్రార్థన సేయుచుఁ జాల ఖిన్న యై
యున్నమహీసుతం గనియె నుగ్రుఁడు రాక్షసనాథుఁ డత్తఱిన్.

491


వ.

మఱియు నధోముఖ యై మహీతలంబున నుపవిష్ట యై యున్నజానకి నవలోకించి
సముచితప్రకారంబున నుపసర్పించి కపటహర్షం బెఱుకపడ దుష్టవాక్యంబున
ని ట్లనియె.

492


ఉ.

ఇంతకు మున్ను నన్ను వరియించి సుఖింపుము సీత యంచు నే
నెంతయు వేఁడిన న్వినక యెవ్వనిపై ననురక్తిఁ జేర్చి న
న్నింత తిరస్కరించి కడుహీనునిఁ జేసితి వట్టినీవిభుం
డంతము నొందె నీవె మగువా యిటు గేహిని వైతివే కదా.

493


చ.

మునుమిడి నీదుదర్పమును మూలము సర్వము ఛిన్న మయ్యెఁ బో
యినపతితోడి దేమి పని యీవ్యసనంబున నేమి వచ్చు నీ
మనమునఁ గల్గుమౌఢ్య మిఁక మాని ననుం దమితో భజించి నా
వనితల కెల్ల మేటి వయి వైభవ మొప్ప సుఖింపు మంగనా.

494


క.

చండక్రోధన మూఢా, పండితమానిని నిరస్తభాగ్యా నీనా
థుం డీల్గె మత్కృతంబున, భండనమున వజ్రిచేత బలుఁడుం బోలెన్.

495