రాముఁడు సుగ్రీవునకుఁ గండుమహర్షి ప్రోక్తగాథలను దెల్పుట
| ఆ. |
కణ్వపుత్రుఁ డైనకండుమహాముని, నాథుచేతఁ గొన్నిగాథలు మును
చెప్పఁబడియె ధర్మశీలప్రకారంబు, తేటపఱతు దానిఁ దెలియ వినుము.
| 374
|
| క. |
శరణాగతుఁ డై శిరమునఁ, గరములు ముకుళించి నన్నుఁ గావు మనుచు నా
ర్తరవంబునఁ బలికెడువాఁ డరియైనను రక్షణీయుఁ డగు నరపతికిన్.
| 375
|
| ఆ. |
ఆర్తుఁ డైన నేమి యటుగాక కడుదృప్తుఁ, డైన నేమి శత్రుఁ డైన నేమి
గావు మన్న యంత జీవిత మర్పించి, యైనఁ గావవలయు నవనిపతికి.
| 376
|
| ఆ. |
కరము ప్రీతి నైనఁ గడుమోహమున నైన, వచ్చి తనదుమఱుఁగుఁ జొచ్చినట్టి
వానిఁ బ్రోవకున్న వసుధేశ్వరునిధర్మ, కౌశలంబు లోకగర్హితంబు.
| 377
|
| క. |
శరణాగతుఁ డేనృపుచేఁ, బరుషోక్తిఁ దిరస్కరింపఁబడుఁ దనదురితో
త్కర మానరపతి కిడి వాఁ, డరుగు దివికి వానిసుకృత మంతయుఁ గొనుచున్.
| 378
|
| క. |
వినుము ప్రపన్నుల రక్షిం, పనినాఁ డైశ్వర్యకీర్తి బలవీర్యవినా
శన మస్వర్గం బాదిగ, ననేకదోషములు గలుగు నవనీపతికిన్.
| 379
|
| వ. |
అని పలికెఁ గావున నేను ధర్మపరంబును నబాధితార్థప్రతిపాదకంబును బాప
నివర్తకధర్మహేతుకంబును గీర్తికరంబు నగుకండుమహామునివచనంబు నమో
ఘంబు గావించెద నది ఫలప్రదానకాలంబు సముపస్థితం బగుచుండ రక్షితకు
స్వర్గప్రదం బగునని యిట్లు ధర్మశాస్త్రప్రసిద్ధం బైనశరణాగతరక్షణరూపధర్మం
బవశ్యం బనుష్టించెద నని పలికి సర్వలోకశరణ్యత్వసర్వశక్తిత్వసర్వజ్ఞత్వపరమ
కారుణికత్వపరమసత్త్వాదిగుణవిశిష్టుండ నైననా కనాదిసిద్ధత్వంబున సహజ
వ్రతవిశేషంబునుం గల దనుతాత్పర్యంబు తేటపడ వెండియు ని ట్లనియె.
| 380
|
| తే. |
మఱుఁగు సొచ్చితిఁ గృప నన్ను మనుపు మనుచు
దీనరవమున నొక్కమా టైన నేమి
విమతుఁ డేనియు నెవఁడేని వేఁడుకొనిన
వాని కభయం బొసంగుట వ్రతము నాకు.
| 381
|
| ఉ. |
ఈదివిజారి కే నభయ మిచ్చితిఁ దోడ్కొని రమ్ము చెచ్చెర
న్లే దొకసందియం బిఁక వలీముఖనాయక వీనిఁ బ్రోచుటే
కా దపరాధి నైతి ననుఁ గావు మటంచు మఱుంగు సొచ్చినం
గా దన కిమ్మెయిం గరుణఁ గైకొని రావణు నైనఁ గాచెదన్.
| 382
|
| వ. |
మఱియు నితండు నిక్కంబుగా విభీషణుం డైనను విభీషణవేషధారి యైనయే
తాదృశాపరాధి యగురావణుం డైన నితనికి శరణాగతరక్షణవ్రతైకదీక్షాద
క్షుండ నైననాచేత నభయంబు దత్తం బయ్యె నింక నీ వితనిం దోడ్కొని రమ్మ
ని పలికిన సుగ్రీవుండు రామునిశరణాగతరక్షణదీక్షయును దనయందలి సౌహార్దాతి
శయంబును విచారించి విస్మయపరవశుఁ డై దేవా నీవు శరణాగతరక్షణధర్మ
|
|